రామ్‌దేవ్ బాబా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు.. దుస్తులు లేక‌పోయినా మ‌హిళ‌లు బాగుంటారు

Baba Ramdev's Remark On Women Sparks Controvers.మ‌హిళ‌ల వ‌స్త్ర‌ధార‌ణ గురించి ప్ర‌ముఖ యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Nov 2022 3:14 AM GMT
రామ్‌దేవ్ బాబా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు.. దుస్తులు లేక‌పోయినా మ‌హిళ‌లు బాగుంటారు

మ‌హిళ‌ల వ‌స్త్ర‌ధార‌ణ గురించి ప్ర‌ముఖ యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. మ‌హిళ‌లు దుస్తులు వేసుకోక‌పోయినా కూడా వారు బాగుంటారు అంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. మ‌హారాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌, ఆయ‌న భార్య అమృతా ఫ‌డ్న‌వీస్ ముందే ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

మ‌హారాష్ట్ర‌లోని థానేలో ప‌తంజ‌లి యోగా పీఠం, ముంబై మ‌హిళ‌ల పతంజ‌లి యోగా స‌మితి సంయుక్తంగా యోగా సైన్స్ శిబిరాల‌ను శుక్ర‌వారం నిర్వ‌హించాయి, మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌, ఆయ‌న భార్య అమృతా ఫ‌డ్న‌వీస్ స‌హా ప‌లువురు మ‌హిళ‌లు దీనికి హాజ‌ర‌య్యారు. యోగా శిబిరం ముగిసిన వెంట‌నే అక్క‌డ ఓ ప్ర‌త్యేక స‌మావేశం జ‌రిగింది.

యోగా శిబిరానికి మ‌హిళ‌లు యోగా దుస్తులు ధ‌రించి వ‌చ్చారు. యోగా శిబిరం ముగిసిన వెంట‌నే స‌మావేశం ప్రారంభం కావ‌డంతో మ‌హిళ‌లు త‌మ దుస్తులు మార్చుకుని చీర‌లు వంటివి ధ‌రించేందుకు వారికి స‌మ‌యం దొర‌క‌లేదు. దీనిపై రామ్‌దేవ్ బాబా మాట్లాడుతూ.. 'మహిళలు చీరలో అందంగా కనిపిస్తారు. సల్వార్ సూట్స్ లో కూడా బాగుంటారు. నా లాగా ఏం వేసుకోకున్నా బాగుంటారు. గతంలో మేం పదేళ్లు వచ్చే వరకు బట్టలే వేసుకోలేదు' అని అన్నారు.

రామ్‌దేవ్ బాబా చేసిన ఈ వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచేలా మాట్లాడార‌ని మ‌హిళా సంఘాలు మండిప‌డుతున్నాయి. మహిళలకు మీరిచ్చే గౌరవం ఇదేనా? అంటూ ప్ర‌శ్నిస్తున్నాయి. త‌క్ష‌ణ‌మే మ‌హిళ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నాయి.

Next Story