మ‌రో నాలుగు విమానాలకు బాంబు బెదిరింపులు..!

దేశంలోని నాలుగు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. సోషల్ మీడియా సైట్ ఎక్స్ నుంచి ఈ బెదిరింపు వచ్చింది

By Medi Samrat  Published on  15 Oct 2024 2:00 PM GMT
మ‌రో నాలుగు విమానాలకు బాంబు బెదిరింపులు..!

దేశంలోని నాలుగు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. సోషల్ మీడియా సైట్ ఎక్స్ నుంచి ఈ బెదిరింపు వచ్చింది. దీంతో భద్రతా సంస్థలు అల‌ర్ట్ అయ్యాయి. అయితే ఈ బెదిరింపులు నకిలీవ‌ని తేలింది. ఈ మేరకు దర్యాప్తు సంస్థలు సమాచారం అందించాయి. నాలుగు విమానాల్లో బాంబులు అమర్చినట్లు ఎక్స్ హ్యాండిల్ పేర్కొంది. పోస్టు చేసిన వ్య‌క్తులు.. విమానయాన సంస్థ, పోలీసు హ్యాండిల్స్‌ను ట్యాగ్ చేశారు.

ఈ విమానాలలో జైపూర్ నుండి బెంగళూరు మీదుగా అయోధ్యకు వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం (IX765), దర్భంగా నుండి ముంబైకి వెళ్లే స్పైస్‌జెట్ విమానం (SG116), సిలిగురి నుండి బెంగళూరుకు వెళ్లే అకాస ఎయిర్ ఎయిర్‌క్రాఫ్ట్ (QP 1373), ఢిల్లీ నుండి చికాగోకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం (QP 1373) ఉన్నాయి.

అయోధ్యకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానంతో స‌హా ఇతర విమానయాన సంస్థల విమానాలకు కూడా ధృవీకరించని సోషల్ మీడియా హ్యాండిల్ నుండి బెదిరింపు వచ్చినట్లు ప్ర‌ముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.

అక్టోబరు 15న ఢిల్లీ నుంచి చికాగోకు వెళ్తున్న ఏఐ127కి బాంబు బెదిరింపులు వచ్చినట్లు ఎయిర్‌లైన్ కంపెనీ ఎయిర్ ఇండియా తెలిపింది. ముందుజాగ్రత్తగా కెనడాలోని ఇకల్యూట్ విమానాశ్రయంలో దింపారు. విచారణ అనంతరం విమానంలో అనుమానాస్పదంగా ఏమీ కనిపించపోక‌.. బాంబు బెదిరింపు నకిలీదని తేలింది.

సోమవారం తెల్లవారుజామున, ముంబై నుండి వస్తున్న మూడు అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపు వచ్చింది, అది నకిలీ అని తేలింది. ఇప్పుడు రెండో రోజు అంటే మంగళవారం నాలుగు విమానాలపై బాంబులు వేస్తామని సోషల్ సైట్ ఎక్స్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. దీంతో వందలాది మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది ఇబ్బందులు పడ్డారు.

Next Story