ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అందరిని ఉరుకులు పరుగులు పెట్టించే సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. తన పాలనలో పలు పేర్లను సైతం మార్చివేసి హిందుత్వానికి సంబంధించి పేర్లను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నారు. తాజాగా అయోధ్యలో నిర్మాణం అవుతున్న విమానాశ్రయానికి పేరును ఖరారు చేశారు యోగి ఆదిత్యానాథ్. శ్రీరాముని పేరు వచ్చేలా 'మర్యాద పురుషోత్తమ్ శ్రీరామ్ ఎయిర్‌పోర్ట్' అని నామకరణం చేశారు.
బడ్జెట్‌లో సైతం విమానాశ్రయానికి గానూ 101 కోట్ల రూపాయలను కేటాయించింది యూపీ ప్రభుత్వం. అంతేకాకుండా దశల వారీగా దీనిని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దనున్నట్లు బడ్జెట్‌లో వెల్లడించింది. ఇక జవార్ విమానాశ్రయంలో ప్రస్తుతం రెండుగా ఉన్న ఎయిర్ స్ట్రిప్పులను ఆరుకు పెంచేందుకు నిర్ణయం తీసుకుంటూ రూ.2వేల కోట్లను కేటాయించింది. అలీగఢ్, మొరాదాబాద్, మీరట్ వంటి నగరాలకు త్వరలో విమాన సేవలు అందించనున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.
కాగా, ప్రస్తుతం అయోధ్యలో ఎయిర్‌పోర్టు నిర్మాణ దశలో ఉంది. అటు రామ మందిర నిర్మాణం కోసం వేగవంతంగా ప్రయత్నాలు కొనగిస్తున్నారు. రామ మందిర నిర్మాణానికి లైన్ క్లీయర్ కావడంతో ఇటు విమానాశ్రయం పనులు కూడా చకచక జరిగిపోతున్నాయి. మందిర నిర్మాణం, విమాశ్రయం కావడంతో మరింత అయోధ్య మరింత అభివృద్ది చెందనుంది. అయోధ్యను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా అన్ని చర్యలు చేపడుతోంది.