రాజమౌళిపై ప్రశంసలు కురిపించిన ఎవెంజర్స్ దర్శకులు

Avengers Endgame director duo Russo Brothers praise RRR director SS Rajamouli. ప్రపంచంలోని గొప్ప చిత్రదర్శకుల లిస్ట్ లో ది రస్సో బ్రదర్స్ ఉంటారు.

By Medi Samrat  Published on  30 July 2022 5:41 PM IST
రాజమౌళిపై ప్రశంసలు కురిపించిన ఎవెంజర్స్ దర్శకులు

ప్రపంచంలోని గొప్ప చిత్రదర్శకుల లిస్ట్ లో ది రస్సో బ్రదర్స్ ఉంటారు. ఇక భారతీయ దర్శకుడు S.S. రాజమౌళి తాను అనుకున్నది తెరపై చూపడానికి ఏ మాత్రం వెనకడుగు వేయడు. వరుస విజయాలతో దూసుకుపోతూ ఉన్నాడు. బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఇటీవల RRR తో సరికొత్త చరిత్ర సృష్టించాడు. తాజాగా రస్సో సోదరులు రాజమౌళిని ప్రశంసించారు.

రస్సో బ్రదర్స్‌తో నెట్‌ఫ్లిక్స్ ఏర్పాటు చేసిన ఇంటరాక్షన్‌లో SS రాజమౌళి మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ సినిమాకు పశ్చిమ దేశాల నుండి వచ్చిన ఆదరణతో నేను ఆశ్చర్యపోయానన్నారు. రాజమౌళి మాట్లాడుతూ "ప్రతి ఒక్కరూ మంచి కథనాన్ని ఆస్వాదిస్తారు, కానీ నేను ఊహించలేదు, నేను అందరి కోసం సినిమాలు చేయగలను. నెట్‌ఫ్లిక్స్‌లో RRR చిత్రం మొదటిసారి కనిపించినప్పుడు, ప్రేక్షకులు చూడటం ప్రారంభించి మెచ్చుకోవడం మొదలుపెట్టారని అన్నారు. విదేశాల నుండి మంచి రివ్యూలు ఇవ్వడం ప్రారంభించినప్పుడు నేను షాక్ అయ్యాను." అని అన్నారు. వారి వర్చువల్ సంభాషణను పోస్ట్ చేస్తూ, రస్సో బ్రదర్స్ రాజమౌళిని ప్రశంసించారు. "గ్రేట్ ఎస్ఎస్ రాజమౌళిని కలవడం చాలా గౌరవంగా ఉంది" అని రాశారు. రాజమౌళి వారికి సమాధానమిస్తూ మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.










Next Story