బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో అవధ్-అస్సాం ఎక్స్‌ప్రెస్ రైలులోని ఏసీ కోచ్‌లో అకస్మాత్తుగా పొగలు వచ్చాయి. దీంతో రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్లో కలకలం రేగింది. రైలు ఆగిన వెంటనే చాలా మంది ప్రయాణికులు బోగీ నుంచి దూకడం ప్రారంభించారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రైలు అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి లాల్‌గఢ్ (పశ్చిమ బెంగాల్) వెళ్తోంది.
అవధ్-అస్సాం ఎక్స్‌ప్రెస్ ముజఫర్‌పూర్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన కాసేపటికే బి2 ఏసీ కోచ్‌లో ఒక్కసారిగా మంటలు వచ్చాయని, దీంతో బోగీలో పెద్ద ఎత్తున పొగ కమ్ముకుందని ప్రయాణీకులు చెబుతున్నారు. పొగ అలుముకోవడంతో ఊపిరి తీసుకోవడం కష్టంగా మారిందన్నారు. వెంటనే రైలును రామదయాలు స్టేషన్‌లో నిలిపివేశారు. రైలు ఆగిన వెంటనే పలువురు ప్రయాణీకులు బోగీల్లోంచి బయటకు పరుగులు తీశారు.
స్పందించిన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ అనంతరం రైలును పంపించారు.
అగ్నిప్రమాదానికి గల కారణాలపై స్పష్టత లేదు
ప్రస్తుతం అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని బావిస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అదే సమయంలో మంటల కారణంగా కోచ్‌కు ఎంత మేరకు నష్టం జరిగిందనేది ఇంకా తెలియాల్సి ఉంది.