Viral Video : ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయిన కేజ్రీవాల్
ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం కొత్త ఇంటికి మారారు. ఈరోజు ఆయన సీఎం అధికారిక నివాసంను ఖాళీ చేశారు.
By Medi Samrat Published on 4 Oct 2024 9:17 AM GMTఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం కొత్త ఇంటికి మారారు. ఈరోజు ఆయన సీఎం అధికారిక నివాసంను ఖాళీ చేశారు. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ తన కుటుంబంతో కలిసి కొత్త ఇంటికి మారారు. వెళ్లే ముందు కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ సీఎం అధికారిక నివాసానికి తాళం వేసి తాళాలు సిబ్బందికి అందజేశారు.
వీడ్కోలు సందర్భంగా కేజ్రీవాల్ భార్య సునీత తాళం చెవులు అందజేయడంతో సిబ్బంది అంతా భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా అందరూ కేజ్రీవాల్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు ముకుళిత హస్తాలతో వీడ్కోలు పలికారు.
CM आवास छोड़कर जनता की अदालत में गए 'काम की राजनीति' के नायक, अरविंद केजरीवाल🙏
— AAP (@AamAadmiParty) October 4, 2024
दिल्ली के लाखों घरों को रोशन कर राजनीति में एक नए अध्याय का आगाज करने वाले अरविंद केजरीवाल जी ने आज अपने परिवार के साथ मुख्यमंत्री आवास छोड़ दिया। pic.twitter.com/FLm3dp2qMr
ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ ఉద్యోగులందరినీ ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నారు. ఉద్యోగులందరినీ కౌగిలించుకున్న కేజ్రీవాల్ అనంతరం సీఎం నివాసం నుంచి వెళ్లిపోయారు.
అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు ఢిల్లీలోని ఫిరోజ్‌షా రోడ్‌లోని ఐదో నంబర్ బంగ్లాలో నివసిస్తున్నారు. పంజాబ్‌కు చెందిన ఆప్ రాజ్యసభ సభ్యుడు అశోక్ మిట్టల్‌కు ఈ బంగ్లా అధికారికంగా కేటాయించబడింది.
కేజ్రీవాల్ కొత్త నివాసం రవిశంకర్ శుక్లా లేన్‌లోని ఆప్ ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఉంది. ఈ నివాసంలో ఆయన తన కుటుంబంతో కలిసి నివసిస్తారు. అక్కడ ఉంటూనే ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల కోసం ఆప్ ప్రచారాన్ని ఆయన పర్యవేక్షిస్తారని పార్టీ నేతలు తెలిపారు.