చైనా ఆర్మీ దుస్సాహసం.. అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్ యువ‌కుడి కిడ్నాప్

Arunachal missing teen Indian Army seeks Chinese counterpart's help.చైనా ఆర్మీ మరోసారి భారతీయుడిని కిడ్నాప్ చేసింది.

By M.S.R  Published on  20 Jan 2022 1:25 PM IST
చైనా ఆర్మీ దుస్సాహసం.. అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్ యువ‌కుడి కిడ్నాప్

చైనా ఆర్మీ మరోసారి భారతీయుడిని కిడ్నాప్ చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎగువ సియాంగ్ జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలుడిని చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) అపహరించినట్లు ఆ రాష్ట్ర ఎంపీ తపిర్ గావో తెలిపారు. మిరామ్ టారోన్ అనే కుర్రాడిని మంగళవారం సియుంగ్లా ప్రాంతంలోని లుంగ్టా జోర్ ప్రాంతం నుండి పిఎల్‌ఎ అపహరించినట్లు తపిర్ గావో చెప్పారు.

లుంగ్తా జోర్ ప్రాంతం నుంచి మిర‌మ్‌ను అప‌హ‌రించిన‌ట్లు ఎంపీ తాపిర్ గావో తెలిపారు. తార‌న్ స్నేహితుడు జానీ య‌యింగ్ పీఎల్ఏ ద‌ళాల నుంచి త‌ప్పించుకున్నాడ‌ని, ఆ కుర్రాడు ఇచ్చిన స‌మాచారంతో తార‌న్ కిడ్నాప్‌కు గురైన‌ట్లు తెలుస్తోంద‌ని ఎంపీ తాపిర్ తెలిపారు. తార‌న్‌, యాయింగ్‌లు స్థానికంగా వేట‌కు వెళ్లేవారని తెలిపారు. భార‌త్‌లోకి సాంగ్‌పో న‌ది ప్ర‌వేశించే ప్రాంతంలో అప‌హ‌ర‌ణ ఘ‌ట‌న చోటుచేసుకుందని అన్నారు. భారత ప్రభుత్వ అన్ని ఏజెన్సీలు అతనిని ముందస్తుగా విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అపహరణకు గురైన బాలుడి చిత్రాలను పోస్ట్ చేశారు.

ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిసిత్ ప్రమాణిక్‌కు సమాచారం అందించామని, ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరామని గావో తెలిపారు. సెప్టెంబర్ 2020లో, చైనా ఆర్మీ అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎగువ సుబంసిరి జిల్లా నుండి ఐదుగురు యువకులను అపహరించి, ఒక వారం తర్వాత వారిని విడుదల చేసింది. ఇప్పుడు అతడిని ఇలా కిడ్నాప్ చేసింది.

మిరామ్ టారోన్ కిడ్నాప్ వ్య‌వ‌హారంపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ విచారం వ్య‌క్తం చేశారు. గ‌ణ‌తంత్ర దినోవ‌త్స‌వానికి కొన్ని రోజుల ముందు ఓ యువ‌కుడిని చైనా కిడ్నాప్ చేసింది. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో మిరామ్ కుటుంబానికి అండ‌గా తాము ఉంటామ‌న్నారు. విశ్వాసం కోల్పోవ‌ద్దు అని, ఓట‌మిని అంగీక‌రించొద్ద‌ని రాహుల్ గాంధీ చెప్పారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని మౌనంగా ఉన్నారంటే దాని అర్థం.. ఆయ‌న‌కు ఏం ప‌ట్ట‌డం లేదా..? అంటూ మండిప‌డ్డారు.

Next Story