ఢిల్లీకి మోడీ అనే ఆక్సిజన్ ఇస్తే తప్ప మోక్షం లేదు: సీఎం చంద్రబాబు

By Knakam Karthik
Published on : 2 Feb 2025 9:26 PM IST

National, Delhi Assembly Elections, Ap Cm Chandrababu, Pm Modi, Kejrival

ఢిల్లీకి మోడీ అనే ఆక్సిజన్ ఇస్తే తప్ప మోక్షం లేదు: సీఎం చంద్రబాబు

ఢిల్లీకి నరేంద్ర మోడీ అనే ఆక్సీజన్ ఇస్తే తప్ప దేశ రాజధానికి మోక్షం లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన బీజేపీ అభ్యర్థి సంజయ్ గోయల్ తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. వాతావరణ కాలుష్యం, మరో వైపు రాజకీయ కాలుష్యంతో ఢిల్లీ పూర్తిగా కలుషితమైందని ఆరోపించారు. కమలం గెలిస్తే ఢిల్లీ బాగుపడుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో ఉండే తెలుగు ప్రజల ఓట్లు అన్నీ గంపగుత్తగా బీజేపీకే పడతాయని అన్నారు. బీజేపీ గెలుపు దేశ చరిత్రలో ఒక మలుపు అని తెలుగు తమ్ముళ్ల చాటి చెప్పాలని ఆయన అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారత ఖ్యాతి పెరిగింది అంటే దానికి కారణం ప్రధాని మోడీ నాయకత్వం అని సీఎం చంద్రబాబు అన్నారు.

సంక్షేమం, సంస్కరణలతో దేశాన్ని 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. ఢిల్లీని చూస్తే బాధ కలుగుతుందని.. 1995లో హైదరాబాద్‌లో పాడుబడినట్టు కనిపించిందని అన్నారు. ఢిల్లీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉండి ఉంటే మరో న్యూయార్క్‌లా ఢిల్లీ మారి ఉండేదని తెలిపారు.

Next Story