బాయ్‌కాట్ పిలుపులపై స్పందించిన కేంద్రమంత్రి

Anurag Thakur Amid 'Pathaan' Row. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ బాయ్ కాట్ అంటూ వస్తున్న పిలుపులపై

By M.S.R  Published on  27 Jan 2023 8:15 PM IST
బాయ్‌కాట్ పిలుపులపై స్పందించిన కేంద్రమంత్రి

కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ బాయ్ కాట్ అంటూ వస్తున్న పిలుపులపై స్పందించారు. శుక్రవారం నాడు ఆయన మాట్లాడుతూ.. కొన్ని చిత్రాలను లక్ష్యంగా చేసుకుని బాయ్ కాట్ అంటూ పిలుపును ఇచ్చే సంస్కృతిని ఖండించారు. భారతదేశం గొప్ప శక్తిగా ఎదుగుతున్న సమయంలో ఇటువంటి సంఘటనలు వాతావరణాన్ని దెబ్బతీస్తున్నాయని అన్నారు. సినిమా విషయంలో ఎవరికైనా సమస్య వస్తే, సంబంధిత ప్రభుత్వ శాఖతో మాట్లాడాలని, వారు చిత్ర నిర్మాతలతో సమస్యను పరిష్కరించగలరని ఆయన అన్నారు.

"భారతదేశం సాఫ్ట్ పవర్‌గా తన ప్రభావాన్ని పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో, భారతీయ చలనచిత్రాలు ప్రపంచంలోని ప్రతి మూలలో సరికొత్త ఒరవడి సృష్టిస్తున్న తరుణంలో, ఇటువంటి చర్చ వాతావరణాన్ని దెబ్బతీస్తుంది" అని ఠాకూర్ అన్నారు.

బుధవారం విడుదలైన షారూఖ్ ఖాన్ నటించిన "పఠాన్" సినిమాను బాయ్ కాట్ చేయాలని అంటూ ఓ వర్గం టార్గెట్ చేసింది. ఈ సమయంలో మంత్రి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల అక్షయ్ కుమార్ "సామ్రాట్ పృథ్వీరాజ్", అమీర్ ఖాన్ "లాల్ సింగ్ చద్దా", దీపికా పదుకొణె "పద్మావత్" చిత్రాలు బాయ్ కాట్ గ్యాంగ్ ను ఎదుర్కొన్నాయి. కొన్ని సినిమాలు సక్సెస్ ను అందుకోగా.. మరికొన్ని సినిమాలు భారీ ఫ్లాప్ లుగా నిలిచాయి.


Next Story