'ఇదే నా చివరి ఆప్షన్'.. కోటాలో మరో విద్యార్థిని ఆత్మహత్య

రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థులు వరుసగా ఆత్మహత్య చేసుకుంటున్నారు.

By Srikanth Gundamalla  Published on  29 Jan 2024 9:30 AM GMT
student, suicide,  kota, rajasthan,

 'ఇదే నా చివరి ఆప్షన్'.. కోటాలో మరో విద్యార్థిని ఆత్మహత్య 

రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థులు వరుసగా ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఒత్తిడితో చదువులు చదవలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే.. అక్కడి ప్రభుత్వం విద్యార్థులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా పలు చర్యలు చేపట్టింది. ఫ్యాన్లు తీసేయడం సహా ఇతర చర్యలు చేపట్టినా విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. కోటాలో తాజాగా మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

కోటాలో 18 ఏళథ్ల జేఈఈ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. తల్లిదండ్రులను ఉద్దేశించి సూసైడ్ నోట్ కూడా రాసింది. అయితే.. జేఈఈ పరీక్ష మరో రెండ్రోజుల్లో రాయాల్సి ఉండగా ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. కోటాలోని శిక్షానగరి ప్రాంతంలో నిహారిక ఉంటూ జేఈఈ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. అయితే.. ఆమె జేఈఈ పరీక్ష 31న జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఇంట్లోని గదిలో ఉరివేసుకుని ఆత్మహతక్య చేసుకుంది. ఈ మేరకు తల్లిదండ్రల కోసం లెటర్‌ను రాసి పెట్టింది.

'అమ్మా, నాన్న.. ఈ జేఈఈ నా వల్ల కాదు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను. నేనే కారణం.. నేను మంచి కూతురుగా ఉండలేకపోయాను. క్షమించండి అమ్మ, నాన్న. ఇదే చివరి ఆప్షన్.' అని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది నిహారిక. కూతురు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వారం రోజుల్లోనే ఇది రెండో ఆత్మహత్య.


ఇక అంతకుము జనవరి 23న కోటాలో ప్రయివేట్ కోచింగ్ ద్వారా నీట్‌కు సిద్ధమవుతున్న యూపీకి చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసకున్నాడు. మొరాదాబాద్‌ కుచెందిన మహ్మద్ జైద్ తన గదిలో ఉరేసుకుని చనిపోయాడు. కోటాలో విద్యార్థులు ఇంజినీరింగ్, మెడికల్ ప్రవేశ పరీక్షల కోసం కోచింగ్‌ ఇనిస్టిట్యూట్లలో చదువుకుంటారు. అయితే.. ఒక్క 2023 ఏడాదిలో ఇక్కడ 29 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.


Next Story