దక్షిణాఫ్రికా నుండి తీసుకువచ్చి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ఉంచిన చిరుతల్లో మరో చిరుత చనిపోయింది. ఆడ చిరుత దక్ష పార్క్‌లోని ఇతర చిరుతలతో జరిగిన పోరాటంలో చనిపోయిందని అంటున్నారు. చిరుతలు తీసుకువచ్చిన తరువాత కునో నేషనల్ పార్క్‌లో మరణించిన మూడవ చిరుత ఇది. వాయు, అగ్నిగా పిలిచే ఇతర చీతాలతో తలపడుతూ దక్ష మరణించిందని పార్క్ వర్గాలు తెలిపాయి.
దక్షిణాఫ్రికా, నమీబియా నుంచి తీసుకువచ్చిన చీతాలను కునో నేషనల్ పార్క్‌లో ఉంచగా దక్ష మృతితో ఇప్పటివరకూ మూడు చిరుతలు మరణించాయి. గత సంవత్సరం ఇరవై చిరుతలను తీసుకురాగా, వాటిలో రెండు ఈ ఏడాది మరణించాయి. ఒకటి మార్చి నెలలో.. మరొకటి ఏప్రిల్ నెలలో చనిపోయాయి. సాషా భారతదేశానికి తీసుకురావడానికి ముందు నుండి మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ.. మార్చిలో మరణించింది. ఏప్రిల్‌లో రెండవ చిరుత ఉదయ్ అనారోగ్యంతో మరణించింది.