మాట నిలబెట్టుకున్న ఆనంద్‌ మహీంద్ర, సర్ఫరాజ్‌ తండ్రికి గిఫ్ట్‌

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.

By Srikanth Gundamalla  Published on  23 March 2024 6:55 AM GMT
anand mahindra, gift, thar car,  sarfaraz khan, father ,

 మాట నిలబెట్టుకున్న ఆనంద్‌ మహీంద్ర, సర్ఫరాజ్‌ తండ్రికి గిఫ్ట్‌

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. టీఇండియా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న సర్ఫరాజ్‌ ఖాన్‌ అదరగొట్టాడు. అయితే.. అప్పుడు సర్ఫరాజ్‌ ఖాన్‌తో తండ్రి అనుబంధానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎంతో కష్టపడి సర్ఫరాజ్‌ఖాన్‌ను తన తండ్రి టీమిండియాలో ఆడేదాకా తీసుకొచ్చాడు. అయితే.. సర్ఫరాజ్‌ తండ్రి కృషిని మెచ్చిన ఆనంద్‌ మహీంద్ర గతంలో ఇక మాట ఇచ్చాడు. సర్ఫరాజ్‌ తండ్రికి త్వరలోనే ఒక థార్‌ను గిఫ్ట్‌గా ఇస్తానని చెప్పాడు. తాజాగా ఆనంద్‌ మహీంద్ర ఆ మాటను నిలబెట్టుకున్నాడు.

2013లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోకి సర్ఫరాజ్‌ఖాన్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇటీవల ఇంగ్లండ్‌తో టీమిండియా టెస్టు సిరీస్ ఆడింది. ఆ జట్టులో సర్ఫరాజ్‌ఖాన్ చోటు సంపాదించుకున్నాడు. ఆడిన తొలి ఇన్నింగ్స్‌లోనే 62 పరుగులతో రాణించాడు. అతని ఆటతీరుతో అందరినీ మెప్పించాడు. సర్ఫరాజ్‌ఖాన్‌పై టీమిండియా క్రికెట్ అభిమానులంతా ప్రశంసలు కురిపించారు. ఆనంద్‌ మహీంద్ర కూడా సర్ఫరాజ్‌ ఖాన్‌ ఆటతీరుకు ఫిదా అయ్యాడు.

టీమిండియాలో చోటు సంపాదించుకునే వరకు సర్ఫరాజ్‌ఖాన్‌ వెంటే ఉండి నడిపించిన తన తండ్రికి థార్‌ కారుని బహుమతిగా ఇస్తున్నట్లు అప్పుడే ఎక్స్‌లో చెప్పారు. స్ఫూర్తిదాయకమైన తండ్రిగా నౌషాద్‌ ఖాన్‌కు థార్‌ కానుకగా ఇవ్వడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని చెప్పారు. ధైర్యం కోల్పోవద్దనీ, శ్రమ, ధైర్యం, సహనం.. పిల్లల్లో స్ఫూర్తి నింపేందుకు ఒక తండ్రికి ఇంతకన్నా ఇంకేం అవసమంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. అయితే.. తాజాగా థార్‌ కారు సర్ఫరాజ్‌ఖాన్ ఇంటికి చేరింది. ఈఫోటోను సర్ఫరాజ్‌ ఖాన్‌ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అద్భుతమైన గిఫ్ట్‌ ఇచ్చిన ఆనంద్‌ మహీంద్రకు అతను ధన్యవాదాలు తెలిపాడు.


Next Story