మాట నిల‌బెట్టుకున్న మ‌హీంద్రా మ్యాన్‌.. 'ఇడ్లీ బామ్మ' కు ఇంటి స్థ‌లం

Anand Mahindra fulfills promise. 'ఇడ్లీ బామ్మ' కు ఇంటి స్థలం ఇచ్చి మాట నిల బెట్టుకున్న ఆనంద్ మహేంద్ర.

By Medi Samrat
Published on : 4 April 2021 1:22 PM IST

Anand Mahindra fullfill promises

'ఇడ్లీ బామ్మ' గుర్తుంది క‌దా.. 30 సంవత్సరాలుగా ఒక్క రూపాయికే ఇండ్లీ అందిస్తూ ఎంతోమంది ఆకలి తీరుస్తున్న మ‌న‌సున్న అమ్మ‌మ్మ‌. కోయంబత్తూరుకు చెందిన ఆ బామ్మ పేరు కమలాథల్. 2019లో సోషల్ మీడియాలో వైర‌ల్ అయిన ఈ బామ్మకు.. దేశీయ వాహ‌న త‌యారీ దిగ్గ‌జం, మ‌హీంద్రా సంస్థ‌ల అధినేత‌ ఆనంద్ మ‌హీంద్రా చేయూత‌నిస్తాన‌ని హామీ ఇచ్చిన విష‌యం తెలిసిందే.

ఆనంద్ మహీంద్రా.. కమలాథల్ కు ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. అందులో బాగంగానే ఇంటి నిర్మాణం కోసం కమలాథల్ పేరు మీద కొంత స్థలం రిజిస్ట్రేషన్ చేయించారు ఆనంద్ మహీంద్రా. అంతేకాదు.. తన కంపెనీకి చెందిన నిర్మాణ సంస్థ త్వరలోనే ఇంటిని నిర్మిస్తుందని కూడా తెలిపారు. అలాగే.. కమలాథల్ ఆ కొత్త ఇంటిలోనే టిఫిన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకునేలా ఇంటిని నిర్మిస్తామని ఆనంద్ మహీంద్రా తెలిపారు. ‌

2019లో సోషల్ మీడియా ద్వారా కమలాథల్ గురించి తెలుసుకున్న ఆనంద్ మహీంద్రా.. క‌ట్టెల పొయ్యి మీద టిఫిన్‌లు చేస్తున్న ఆమెకు.. మొదట గ్యాస్ కనెక్షన్ ఇప్పించాలనుకున్నారు. అయితే ఆనంద్ మహీంద్రా తీసుకున్న ఈ నిర్ణయాన్ని తెలుసుకున్న స్థానిక భారత్ గ్యాస్ ఎజెన్సీ.. కమలాథల్‌కు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్ ఇచ్చింది. ఇది తెలుసుకున్న ఆనంద్ మహీంద్రా.. గ్యాస్ ఏజెన్సీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇలా ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకున్న‌ ఆనంద్ మహీంద్రాను నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు.


Next Story