సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ.. దేశంలో అలజడి సృష్టించేందుకు కుట్రలు చేస్తోన్న పాకిస్థాన్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గట్టి వార్నింగ్ ఇచ్చారు. అతిక్రమణకు పాల్పడితే మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్ తప్పవని హెచ్చరించారు. గోవాలోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీకి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. పాకిస్థాన్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అతిక్రమణకు పాల్పడితే మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్ తప్పవని హెచ్చరించిన ఆయన దాడులను ఏమాత్రం సహించబోమని సర్జికల్ స్ట్రైక్స్ ఇప్పటికే ఓసారి నిరూపించాయని గుర్తు చేశారు. ఒకప్పుడు చర్చలకు సమయం ఉండేదని.. ఇప్పుడు మాత్రం బదులిచ్చే సమయం వచ్చేసిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం ఈ సర్జికల్ స్ట్రైక్ అని.. భారత సరిహద్దులను ఎవరూ చెరిపే ప్రయత్నం చేయకూడదన్న గట్టి సందేశం దీని ద్వారా వెళ్లిందన్నారు.