'నేను ఇంకా బతికే ఉన్నాను'.. సీఎంకు పోలీస్‌ రికార్డులో చనిపోయిన వ్యక్తి లేఖ

దాదాపు ఆరు నెలల క్రితం పోలీసు రికార్డులో చనిపోయినట్లు ప్రకటించబడిన బీహార్ వ్యక్తి, తాను సజీవంగా ఉన్నానని,

By అంజి  Published on  2 May 2023 10:00 AM IST
Bihar CM, DGP, Nitish Kumar, Viral news

'నేను ఇంకా బతికే ఉన్నాను'.. సీఎంకు పోలీస్‌ రికార్డులో చనిపోయిన వ్యక్తి లేఖ

దాదాపు ఆరు నెలల క్రితం పోలీసు రికార్డులో చనిపోయినట్లు ప్రకటించబడిన బీహార్ వ్యక్తి, తాను సజీవంగా ఉన్నానని, కొత్తగా పెళ్లయిన భార్యతో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో జీవిస్తున్నానని పేర్కొంటూ బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిజిపి, గోపాల్‌గంజ్ ఎస్పీ, డియోరియా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓలకు లేఖ రాశాడు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మణిభూసన్ శ్రీవాస్తవ కుమారుడు సోను కుమార్ శ్రీవాస్తవ (30) 5 నెలల 25 రోజుల క్రితం డియోరియా గ్రామంలో అదృశ్యమయ్యాడు.

అతను కొన్ని వస్తువులు కొనుగోలు చేయడానికి పాట్నా వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని అతని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. రెండు రోజుల తర్వాత డియోరియా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే ప్రాంతంలో గొంతు కోసి హత్య చేయబడిన ఓ మృతదేహం కనుగొనబడింది. అతని తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు ఆ మృతదేహాం సోను కుమార్‌దేనని గుర్తించారు. ఆ తర్వాత పోలీసులు కిడ్నాప్, హత్యగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సరుకులు కొనేందుకు రూ.50వేలు తీసుకుని సోనుకుమార్‌ పాట్నాకు బస్సులో వెళ్లాడని తండ్రి శ్రీవాస్తవ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. డియోరియా చౌక్‌కు చేరుకున్న తర్వాత, ఎవరో కాల్ రావడంతో అతను బస్సులోంచి దిగాడు.

''బస్సు నుండి డి-బోర్డింగ్ తర్వాత, అతను కొన్ని మీటర్లు నడిచి అదృశ్యమయ్యాడు. మేము అతని తండ్రి నుండి మిస్సింగ్ ఫిర్యాదును స్వీకరించాము. చివరి ఫోన్ కాల్ లొకేషన్ ఆధారంగా శోధన ఆపరేషన్ ప్రారంభించాము. ఆ ప్రాంతమంతా వెతికినా ఏమీ దొరకలేదు. కొన్ని రోజుల తర్వాత, సోషల్ మీడియాలో గొంతు కోసిన మృతదేహం కనిపించడంతో శ్రీవాస్తవ కుటుంబ సభ్యులు అతనిని తమ కుమారుడిగా గుర్తించారు. తదనుగుణంగా, వారు మా పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్, హత్యకు సంబంధించిన సంబంధిత ఐపిసి సెక్షన్ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు'' అని డియోరియా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఉదయ్ కుమార్ సింగ్ తెలిపారు.

అతను తన పక్క గ్రామానికి చెందిన నీలం కుమారి అనే అమ్మాయితో పారిపోయి ఘజియాబాద్ వెళ్లి అక్కడ సంతోషంగా ఉంటున్నాడని యువకుడి “లేఖ” పేర్కొంది. పెళ్లికి సంబంధించిన ఆధారాలను కూడా పంపించాడు. పోలీస్ స్టేషన్‌లో నమోదైన కిడ్నాప్ కమ్ మర్డర్ ఎఫ్‌ఐఆర్ తప్పు అని ఆయన అన్నారు. “అతని ఒప్పుకోలు తరువాత, మేము అతని కుటుంబ సభ్యులకు సందేశాన్ని అందించాము. తదుపరి విచారణ కొనసాగుతోంది' అని సింగ్ చెప్పారు.

Next Story