నా కుమార్తెను నగ్న ఫోటోలు పంపమని కోరాడు : అక్షయ్ కుమార్

శుక్రవారం ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో నటుడు అక్షయ్ కుమార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రికి కీలక సూచన చేశారు.

By -  Medi Samrat
Published on : 3 Oct 2025 4:23 PM IST

నా కుమార్తెను నగ్న ఫోటోలు పంపమని కోరాడు : అక్షయ్ కుమార్

శుక్రవారం ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో నటుడు అక్షయ్ కుమార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రికి కీలక సూచన చేశారు. 7 నుండి 10 తరగతుల విద్యార్థుల కోసం వారానికోసారి "సైబర్ పీరియడ్" ను ప్రవేశపెట్టాలని కోరారు. సైబర్ నేరాల ద్వారా పెరుగుతున్న ముప్పును హైలైట్ చేయడానికి అక్షయ్ కుమార్ తన విషయంలో జరిగిన ఓ సంఘటనను వివరించాడు.

రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన సైబర్ అవగాహన నెల-2025 ప్రారంభోత్సవంలో, అక్షయ్ కుమార్ తన కుమార్తె కు జరిగిన ఒక షాకింగ్ సంఘటనను బయట పెట్టాడు. కొన్ని నెలల క్రితం, తన కుమార్తె ఆన్‌లైన్ వీడియో గేమ్ ఆడుతున్నప్పుడు ఒక అపరిచితుడు ఆమెను న్యూడ్స్ అడుగుతూ సందేశం పంపాడని ఆయన గుర్తు చేసుకున్నారు. నా కుమార్తె వెంటనే గేమ్‌ను ఆపివేసి తన తల్లికి సమాచారం ఇచ్చింది. సైబర్ క్రైమ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అక్షయ్ కుమార్ సూచించారు.

Next Story