న‌టుడు అజ‌య్ దేవ్‌గ‌ణ్ వ‌చ్చే లోపు ఉరొదిలి వెళ్తా : ఆనంద్ మ‌హీంద్రా

Ajay Devgn was 'irked' during an ad shoot.ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మ‌హీంద్రా సోష‌ల్ మీడియాలో య‌మా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Feb 2022 9:51 AM IST
న‌టుడు అజ‌య్ దేవ్‌గ‌ణ్ వ‌చ్చే లోపు ఉరొదిలి వెళ్తా : ఆనంద్ మ‌హీంద్రా

ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మ‌హీంద్రా సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టివ్‌గా ఉంటారు అన్న సంగ‌తి తెలిసిందే. ఆయన స‌మకాలీన అంశాల‌పైన స్పందిస్తూనే ప్రేర‌ణ క‌లిగించే, ఆలోచ‌న రేకెత్తించే పోస్టులు పెడుతుంటారు. అప్పుడ‌ప్పుడూ కొన్ని ఫ‌న్నీ వీడియోల‌ను షేర్ చేస్తుంటారు. ఆయ‌న చేసే ట్వీట్ కోసం ఎదురుచూసేవారు ఎంతో మంది ఉంటారు అన్న‌దానిలో అతిశ‌యోక్తి లేదేమో. తాజాగా.. బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ్‌గ‌ణ్ వ‌చ్చేలోపు తాను ఊరు వ‌దిలి వెళ్ల‌టం మంచిద‌నిపిస్తుంద‌ని.. ఆయ‌న ఓ వీడియోను షేర్ చేశాడు. ప్ర‌స్తుతం ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఆ వీడియోలో ఏం ఉందంటే.. మ‌హీంద్రా గ్రూప్‌న‌కు చెందిన ట్ర‌క్‌, బ‌స్ యాడ్‌లో న‌టించేందుకు అజ‌య్ దేవ్‌గ‌ణ్ సిద్దం అవుతుంటారు. అయితే.. యాడ్ స్క్రిప్టులో కొన్ని మార్పులు క‌నిపిస్తాయి. దీనిపై అజ‌య్ దేవ్‌గ‌ణ్ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తాడు. ఇంకెన్ని సార్లు మారుస్తారు అని కాస్త సీరియ‌స్ అవుతాడు. అయితే.. అవ‌త‌లి నుంచి ఓ గొంతు.. 'నాలుగుసార్లే మార్చాం స‌ర్' అని స‌మాధానం చెప్ప‌డం వినిపిస్తుంది. దీంతో అజ‌య్ దేవ్‌గ‌న్ మరింత అస‌హ‌నానికి గుర‌వుతాడు.

ఈ వీడియోను మహీంద్రా ట్రక్ అండ్ బస్ సంస్థ ట్వీట్ చేయ‌గా.. దాన్ని ఆనంద్ మ‌హీంద్రా షేర్ చేస్తూ.. 'అజయ్ దేవగణ్ అసహనంగా ఉన్నట్టు స‌మాచారం అందింది. ఆయన ఇక్కడకు రాకముందే నేనే ఊరొదిలి వెళ్లిపోవడం మంచిది' అని క్యాప్షన్ త‌గిలించి ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.ఏదైనా స‌రే ప్ర‌చారం చేయ‌డంతో ఆనంద్ మ‌హీంద్రా త‌రువాత‌నే ఎవ‌రైనా అని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

Next Story