తొలిసారి మిజోరానికి రైల్వే కనెక్టివిటీ.. 'ఐజ్వాల్‌' ఇప్పుడ భారత రైల్వే మ్యాప్‌లో ఉందన్న ప్రధాని

ఈశాన్య రాష్ట్రం మిజోరంను తొలిసారిగా భారత రైల్వే నెట్‌వర్క్‌కు అనుసంధానిస్తూ కీలక రైల్వే లైన్‌ను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.

By -  అంజి
Published on : 13 Sept 2025 11:21 AM IST

Aizawl, India rail map, PM Modi, Mizoram

తొలిసారి మిజోరానికి రైల్వే కనెక్టివిటీ.. 'ఐజ్వాల్‌' ఇప్పుడ భారత రైల్వే మ్యాప్‌లో ఉందన్న ప్రధాని

ఈశాన్య రాష్ట్రం మిజోరంను తొలిసారిగా భారత రైల్వే నెట్‌వర్క్‌కు అనుసంధానిస్తూ కీలక రైల్వే లైన్‌ను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. రూ.8,070 కోట్లతో నిర్మించిన బైరబీ - సైరాంగ్‌ లైన్‌ను జాతికి అంకితం చేశారు. ఇప్పుడు కొత్త లైన్ మిజోరంలోని సైరాంగ్‌ను రాజధాని ఎక్స్‌ప్రెస్ ద్వారా ఢిల్లీతో నేరుగా కలుపుతుందని, రాష్ట్రాన్ని జాతీయ రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానించడంలో ఇది ఒక చారిత్రాత్మక మైలురాయి అని ఆయన నొక్కి చెప్పారు. కొండ ప్రాంతంలో 45 టన్నెల్స్‌, 55 మేజర్‌, 88 మైనర్‌ బ్రిడ్జిలతో దీన్ని పూర్తి చేశారు.

మిజోరంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించిన తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశ బలమైన ఆర్థిక పనితీరును హైలైట్ చేశారు. 2025-26 మొదటి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధి చెందిందని, ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా, ఎగుమతుల పురోగతిని ఆయన నొక్కిచెప్పారు. ఆర్థిక, తయారీ వృద్ధిని జాతీయ భద్రతకు అనుసంధానించారు.ఆపరేషన్ సిందూర్‌లో మేడ్-ఇన్-ఇండియా ఆయుధాలు కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు.

ఎన్నో ఏళ్లుగా కొన్ని పార్టీల ఓట్‌ బ్యాంక్ రాజకీయాలతో ఈశాన్య రాష్ట్రాలన్నీ తీవ్రంగా నష్టపోయాయని అన్నారు. తాము 11 ఏళ్లుగా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఇండియా గ్రోత్‌ ఇంజిన్‌గా నార్త్‌ఈస్ట్‌ మారిందన్నారు. తొలిసారిగా రోడ్స్‌, హైవేలు, రైల్వే కనెక్టివిటీ, ఎలక్ట్రిసిటీ సౌకర్యాలు కల్పించామన్నారు. ట్రేడ్‌, టూరిజం వృద్ధి చెందుతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Next Story