చండీగఢ్‌లో మోగిన సైరన్.. ప్రజలు బయటికి రావొద్దని హెచ్చరిక
చండీగఢ్‌లో వైమానికి దళం శుక్రవారం సైరన్లు మోగించి హెచ్చరిక జారీ చేసింది.
By Knakam Karthik
చండీగఢ్‌లో మోగిన సైరన్.. ప్రజలు బయటికి రావొద్దని హెచ్చరిక
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. సరిహద్దు జిల్లాలపై పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడుతోంది. పాక్ వైపు నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ క్రమంలోనే చండీగఢ్‌లో వైమానికి దళం శుక్రవారం సైరన్లు మోగించి హెచ్చరిక జారీ చేసింది. దాడులు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. బాల్కనీల్లోకి కూడా రావొద్దని స్పష్టం చేసింది. ఇళ్లల్లోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
కాగా శుక్రవారం ఉదయం నుంచి కుప్వారా, యూరీలలో పాక్ సైనికులు తీవ్ర స్థాయిలో కాల్పులకు పాల్పడుతున్నారు. భారత సైన్యం ధీటుగా జవాబిస్తోంది. గురువారం పాక్ సైనికులు జరిపిన కాల్పులకు ఐదుగురు చిన్నారులు సహా మొత్తం పదహారు మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. సరిహద్దు రాష్ట్రం పంజాబ్ లోని చండీగఢ్ లో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. వైమానిక దాడులు జరిగే అవకాశం ఉందని ప్రజలను హెచ్చరించారు. ఎయిర్ ఫోర్స్ అధికారులు సైరన్ మోగించి అప్రమత్తం చేశారు. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని మైక్ ల ద్వారా హెచ్చరించారు. డాబాపైకి, బాల్కనీలలోకి రావొద్దని సూచించారు.
#WATCH | Air siren sounded in Chandigarh as part of a precautionary measure to remind citizens to remain alert pic.twitter.com/IOl2RRqW0G
— ANI (@ANI) May 9, 2025