ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం కారణంగా అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అమెరికాలోని నెవార్క్ నుంచి 300 ప్రయాణీకులతో ఢిల్లీకి ఎయిరిండియా విమానం బయలుదేరింది. అయితే.. కొద్దిసేపటికే ఓ ఇంజిన్‌లో ఆయిల్ లీక్ కావడాన్ని ఫైలట్లు గుర్తించారు. వెంటనే విమానాన్ని దారి మళ్లించి స్వీడన్‌లోని స్టాక్ హోంలో ల్యాండ్ చేశారు.
ఆయిల్ లీక్ కావడంతో ఓ ఇంజిన్ షట్ డౌన్ అయ్యింది. ల్యాండ్ చేసేటప్పుడు మంటలు చెలరేగే అవకాశం ఉండడంతో విమానం ల్యాండ్ అయ్యే సమయానికి ఎయిర్ పోర్టు వద్ద ఫైరింజన్లను అందుబాటులో ఉంచారు. ఎలాంటి ప్రమాదం లేకుండా ఫైలట్లు ల్యాండింగ్ చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం ప్రయాణీకులు అంతా సురక్షితంగా ఉన్నారని విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉంటే.. సోమవారం న్యూయార్క్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో మెడికల్ ఎమరెన్సీ కారణంగా.. విమానాన్నిలండన్ కు మళ్లించిన సంగతి తెలిసిందే.