బంగారం స్మగ్లింగ్.. ఎయిర్ ఇండియా క్యాబిన్ క్రూ అరెస్ట్

బంగారాన్ని అక్ర‌మంగా ర‌వాణా చేస్తున్న ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బందిని కొచ్చి విమానాశ్రయంలో అధికారులు అరెస్టు చేశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 March 2023 11:46 AM IST
Gold Smuggling, Air India

బంగారాన్ని చేతుల‌కు చుట్టుకున్న దృశ్యం

బంగారాన్ని అక్ర‌మంగా ర‌వాణా చేస్తున్న ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బందిని బుధవారం కొచ్చి విమానాశ్రయంలో అధికారులు అరెస్టు చేశారు. వాయనాడ్‌కు చెందిన షఫీ బహ్రెయిన్-కోజీకోడ్-కొచ్చి విమానం కేబిన్ క్రూలో పనిచేస్తున్నాడు. అత‌డు బంగారం తీసుకొస్తున్నట్టు అధికారులకు విశ్వసనీయ సమాచారం అందింది. కొచ్చి ఎయిర్‌పోర్టులో అత‌డిని అదుపులోకి తీసుకున్నారు. బంగారాన్ని చేతుల‌కు చుట్టి, చొక్కా స్లీవ్‌ను క‌ప్పుకుని గ్రీన్ ఛాన‌ల్ గుండా వెళ్లాల‌ని అత‌డు చేసిన ప్లాన్‌ను అధికారులు భ‌గ్నం చేశారు. అత‌డి నుంచి 1,487 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అత‌డిని క‌స్ట‌మ్స్ అధికారులు విచారిస్తున్నారు.

మరో ఘ‌ట‌న‌లో 3.32 కోట్ల విలువైన 6.8 కిలోల బంగారాన్ని చెన్నై విమానాశ్రంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్ద‌రిని అరెస్ట్ చేశారు. వీరిద్ద‌రు సింగపూర్ నుంచి వేరు వేరు విమానాల్లో వ‌చ్చార‌ని అధికారులు తెలిపారు. వారి ల‌గేజీని త‌నిఖీ చేయ‌గా బంగారం బ‌య‌ట‌ప‌డింది. బంగారం అక్ర‌మ ర‌వాణాకు సంబంధించి త‌మ‌కు అందిన స‌మాచారం ఆధారంగా వారిని అదుపులోకి తీసుకున్న‌ట్లు చెన్నై క‌స్ట‌మ్స్ అధికారులు తెలిపారు.

Next Story