కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. పైలట్లిద్దరూ సేఫ్‌..!

మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది.

By Medi Samrat  Published on  6 Feb 2025 3:51 PM IST
కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. పైలట్లిద్దరూ సేఫ్‌..!

మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్లిద్దరూ గాయపడినట్లు సమాచారం. హెలికాప్టర్ పొలంలో కూలిపోయింది.. దీంతో మంటలు చెలరేగాయి. ఘటన అనంతరం గ్రామస్తులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పైలట్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

సమాచారం ప్రకారం, గురువారం మధ్యాహ్నం నార్వార్ తహసీల్‌లోని దబరసాని గ్రామంలో ఆర్మీ హెలికాప్టర్ క్రాష్ అయి రైతుల పొలాల్లో పడిపోయింది. ప్ర‌మాదానికి గురైన‌ హెలికాప్టర్ కాలి బూడిదైంది. అయితే హెలికాప్టర్‌లో ఉన్న పైలట్లిద్దరూ పూర్తిగా సురక్షితంగా ఉన్నారు. పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నట్లు సమాచారం. హెలికాప్టర్ కూలిపోవడానికి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు.


Next Story