ఎంఐఎం పార్టీ ఒక్క తెలంగాణకే పరిమితమవ్వకూడదని అసదుద్దీన్ ఒవైసీ భావించిన సంగతి తెలిసిందే..! అయితే పలు రాష్ట్రాలలో పోటీకి నిలబెట్టాడు. ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను సెలెక్ట్ చేసుకోవడం.. ఆయా ప్రాంతాల్లో భారీ ఎత్తున ప్రచారం నిర్వహించి తన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం చేశారు. ఇలా గతంలో కొన్ని రాష్ట్రాల్లో ఎంఐఎం విజయాన్ని అందుకుంది. అయితే ఈ ఏడాది బెంగాల్ లో మాత్రం అసదుద్దీన్ వ్యూహాలు ఫలించలేదు.
బెంగాల్ ఎన్నికల్లో పోటీచేసిన అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ముస్లిం ఓటర్లపై భారీ ఆశలు పెట్టుకున్నా బెంగాల్‌లో మాత్రం ఎంఐఎం ఎత్తులు ఫలించలేదు. ఏ మాత్రం కూడా ఆ పార్టీకి ఓట్లు పడలేదు. ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అసదుద్దీన్ తన పార్టీ అభ్యర్థులను నిలిపినప్పటికీ.. వారు ఓటర్లను ఆకర్షించడంలో ఘోరంగా విఫలమయ్యారు. కనీసం పరువు నిలబడే స్థాయిలో కూడా ఓట్లను సొంతం చేసుకోలేకపోయారు అసదుద్దీన్ నిలబెట్టిన అభ్యర్థులు. అసదుద్దీన్ పశ్చిమ బెంగాల్ లో కూడా తమ పార్టీని పటిష్టం చేయాలని అనుకోగా.. ఆయన అనుకున్నది జరగలేదు.