ఢిల్లీ, బాంబే హైకోర్టులకు బాంబు బెదిరింపులు
ఢిల్లీ హైకోర్టుకు శుక్రవారం ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది.
By - Medi Samrat |
ఢిల్లీ హైకోర్టుకు శుక్రవారం ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. ఈ-మెయిల్ అందిన వెంటనే కోర్టు ఆవరణలో గందరగోళం నెలకొంది. ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు హైకోర్టు కాంప్లెక్స్‌ను ఖాళీ చేయించారు. సమాచారం అందుకున్న పోలీసులు, దర్యాప్తు సంస్థలు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ-మెయిల్‌లో పవిత్ర శుక్రవారం పేలుళ్లకు పాకిస్తాన్ మరియు తమిళనాడు మధ్య కుట్ర ఉందని, 'జడ్జి గది/కోర్టు ఆవరణలో మూడు బాంబులు అమర్చామని.. మధ్యాహ్నం 2 గంటలకు ఖాళీ చేయండని రాసి ఉంది.
శుక్రవారం కోర్టు కార్యకలాపాలు యథావిధిగా జరుగుతున్నాయి. బెంచ్‌లన్ని తమ తమ పనుల్లో బిజీ అయిపోయాయి. ఈ సమయంలో బాంబు బెదిరింపు సమాచారం అందడంతో కలకలం రేగింది. దీంతో కోర్టు లోపల గందరగోళ వాతావరణం నెలకొంది.
ఢిల్లీ తర్వాత బాంబే హైకోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. బాంబు నిర్వీర్య దళం సంఘటనా స్థలానికి చేరుకుంటుంది. ప్రస్తుతం ఆవరణ మొత్తాన్ని ఖాళీ చేయిస్తున్నారు. పోలీసులు ప్రతి మూలను సోదా చేస్తున్నారు. అంతకుముందు ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో న్యాయవాదులు, న్యాయమూర్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. న్యాయమూర్తి అకస్మాత్తుగా లేచి నిలబడ్డాడు.
ఇంతకు ముందు కూడా అప్పుడప్పుడు ఈ-మెయిల్ ద్వారా వివిధ పాఠశాలలపై బాంబులు వేస్తామని ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. అయితే పోలీసుల విచారణలో అనుమానాస్పద వస్తువులు ఏమీ కనిపించలేదు.
ఢిల్లీ పోలీసుల డేటా ప్రకారం.. జనవరి, ఆగస్టు మధ్య ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని 100 కంటే ఎక్కువ విద్యా సంస్థలకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. వీటిలో DPS వసంత్ విహార్, అమిటీ స్కూల్ సాకేత్, సాల్వాన్ పబ్లిక్ స్కూల్, మోడ్రన్ స్కూల్, వసంత్ వ్యాలీ స్కూల్, సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ మరియు శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (SRCC) వంటి సంస్థలు ఉన్నాయి.