భార్య ఆవేశానికి కటకటాల పాలైన భర్త ఏమంటున్నాడంటే..
Delhi couple gives absurd excuses. ఢిల్లీకి చెందిన జంట మాస్క్ గురుంచి జరిగిన గొడవలో తప్పు తన భార్య డే అని చెప్పుకొచ్చాడు.
By Medi Samrat Published on 20 April 2021 1:45 PM ISTగత రెండు రోజులుగా ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే..! ఢిల్లీకి చెందిన ఓ జంట కారులో తిరుగుతూ.. మాస్కు పెట్టుకోమని అడిగిన పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని దరియాగంజ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తాము మాస్కు పెట్టుకోమని.. ఇద్దరూ కారులో తిరుగుతూ ఉన్నామని.. తమతో ఎవరూ లేరు.. భార్యాభర్తలమని చెప్పుకొచ్చింది. నాకు మాస్క్ లేదు.. అయితే నా భర్తను ముద్దు పెట్టుకుంటా.. నన్ను ఆపగలవా అంటూ పోలీసులనే ఎదురు ప్రశ్నించింది. ఆమె భర్త కూడా నా కారు ఎందుకు ఆపావు అంటూ పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా.. విధుల్లో పోలీసులతో దురుసుగా మాట్లాడినందుకు ఆ జంటపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు పలు సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు.. ఆమె భర్తను కస్టడీలోకి తీసుకున్నారు.
పోలీసులతో జరిగిన గొడవపై మహిళ భర్త నిర్వేదాన్ని వ్యక్తం చేశాడు. మీడియాతో మాట్లాడుతూ భార్య ఆవేశం కారణంగా తాను అనవసరంగా కోపాన్ని తెచ్చుకున్నానని అదే తాను చేసిన తప్పు అని అన్నాడు. ఈ గొడవ మొత్తానికి కారణం తన భార్యేనని పంకజ్ దత్తా చెప్పుకొచ్చాడు. తప్పంతా తన భార్యదేనని, మాస్కు పెట్టుకోవాలని చెబుతున్నా వినలేదని చెప్పాడు. తననూ పెట్టుకోనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేయడమే కాకుండా.. మాస్క్ విషయమై తామిద్దరం కారులో గొడవ పడ్డామని, అదే సమయంలో పోలీసులు ఆపారని తెలిపాడు. పోలీసులతో గొడవ తనకు ఇష్టం లేకున్నా భార్యే తనను రెచ్చగొట్టిందని అన్నాడు. ఆమె పక్కన లేనప్పుడు తాను మాస్క్ ధరిస్తానని చెప్పిన పంకజ్.. అందరూ విధిగా మాస్కులు ధరించాలని కోరాడు.