పార్టీ జెండాను విడుదల చేసిన హీరో విజయ్‌

రాజకీయ అరంగేట్రం చేసిన తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ దళపతి కొత్తగా స్థాపించిన తన రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' జెండాను విడుదల చేశారు

By అంజి
Published on : 22 Aug 2024 4:20 AM

Actor Vijay, Tamilaga Vettri Kazhagam flag, symbol, Tamilnadu

పార్టీ జెండాను విడుదల చేసిన హీరో విజయ్‌

రాజకీయ అరంగేట్రం చేసిన తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ దళపతి కొత్తగా స్థాపించిన తన రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' జెండాను ఆగస్టు 22, గురువారం నాడు విడుదల చేశారు. బుధవారం ఉదయం 9.15 గంటలకు చెన్నై పనైయూర్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జెండాను విజయ్ ఆవిష్కరించారు. పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన అనంతరం పార్టీ యాంథమ్‌ను రిలీజ్‌ చేశారు. ఫిబ్రవరిలో పార్టీ ప్రకటన చేసిన విజయ్‌ 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికలలో ఆయన పార్టీ ఏ రాజకీయ కూటమికి మద్దతు ఇవ్వలేదు, ఇక్కడ తమిళనాడులో డిఎంకె నేతృత్వంలోని కూటమి ఎన్నికలలో విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. విజయ్ 2026 అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించారు. సెప్టెంబర్ 5న విడుదల కానున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన యాక్షన్ థ్రిల్లర్ "GOAT" తర్వాత తాను సినిమాల నుండి రిటైర్ అవుతానని ఇప్పటికే ప్రకటించాడు.

Next Story