పోలింగ్‌ బూత్‌ వద్ద సామాన్యులకు అసౌకర్యం.. క్షమాపణలు చెప్పిన తలపతి విజయ్‌

Actor Vijay apologises for causing inconvenience at polling booth. శనివారం చెన్నైలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రముఖ సినీ నటుడు తలపతి విజయ్ ఓటు వేశారు. నటుడు విజయ్‌ పోలింగ్

By అంజి  Published on  19 Feb 2022 12:56 PM IST
పోలింగ్‌ బూత్‌ వద్ద సామాన్యులకు అసౌకర్యం.. క్షమాపణలు చెప్పిన తలపతి విజయ్‌

శనివారం చెన్నైలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రముఖ సినీ నటుడు తలపతి విజయ్ ఓటు వేశారు. నటుడు విజయ్‌ పోలింగ్ బూత్ వద్దకు వచ్చినప్పుడు, అతనిని చూసేందుకు భారీ గుంపు, మీడియా అతనిని చుట్టుముట్టింది. ఇది సామాన్య ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించింది. అది గమనించిన విజయ్ వెంటనే పోలింగ్ బూత్‌లో జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పాడు. తమిళనాడులో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ శనివారం ప్రారంభమైంది. పదేళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికలు ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె), అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఎఐఎడిఎంకె) మధ్య హోరాహోరీ పోరు తప్ప మరొకటి కాదు. అయితే, బీజేపీ కూడా రాష్ట్రంలో పట్టు సాధించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది.

648 పట్టణ స్థానిక సంస్థలు, 12,607 వార్డు సభ్యులకు ఎన్నికలు జరుగుతున్నాయి. అధికారంలో ఉన్న డిఎంకె అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల నుండి తమ సుపరిపాలన గురించి పాయింటర్‌లతో ప్రచారం చేయగా, ఎఐఎడిఎంకె శాంతిభద్రతలను దిగజార్చిందనే ఆరోపణలతో ప్రచారం చేసింది. ఓట్లకు బదులుగా నగదు, బహుమతులు ఇచ్చి ప్రజలను మభ్య పెట్టారని ఆరోపించింది. ఒంటరిగా పోటీ చేస్తున్న బీజేపీ కన్యాకుమారి, కొంగు బెల్ట్‌లలో ప్రచారంపై దృష్టి సారించింది.

Next Story