భారత్ - పాక్ మధ్య కాల్పుల విరమ కోసం రాత్రంతా కష్టపడ్డానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనడంపై నటుడు ప్రకాష్ రాజ్ సెటైర్లు వేశారు. సర్దార్ డొనాల్డ్ సింగ్ ట్రంప్, సర్పంచ్ ఆఫ్ అమ్రికా కలాన్ అంటూ ఆయనకు తలపాగా చుట్టిన పిక్ షేర్ చేశారు. అమెరికా సైన్యం పాక్‌లోకి చొరబడి ఒసామా బిన్ లాడెన్‌ను చంపితే న్యాయమన్నారు. భారత్ చేస్తే మాత్రం సీజ్‌ఫైర్ చేయాలంటూన్నారు? ఏ షరతులతో ఈ ఒప్పందం చేసుకున్నారు? అంటూ ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు.
అంతకుముందు పాకిస్థాన్‌తో భారత్ వీరోచితంగా పోరాడుతుంటే.. బీజేపీ సోషల్ మీడియా వేదికగా తన నీచబుద్ది చూపిస్తోందని ప్రకాశ్ రాజ్ విమర్శలు గుప్పించారు. భారత్ - పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ శాంతి చర్చలంటూ సమయం గడపదంటూ బీజేపీకి చెందిన అధికారిక సోషల్ మీడియా ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోపై ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ.. భారత సైన్యం ఓ వైపు యుద్ధం చేస్తుంటే.. సరిహద్దుల్లో పౌరులు రక్తమోడుతుంటే.. కొందరూ మతోన్మాదలు మాత్రం అత్యంత నీచమైన రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇలా చేస్తుంటే మీకు సిగ్గనిపించట్లేదా? అని ప్రకాశ్ రాజ్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.