ఆప్ గుజరాత్ ముఖ్యమంత్రి అభ్యర్థి పోటీ చేసేది ఏ స్థానం నుంచో తెలుసా..?

AAP’s CM candidate Isudan Gadhvi to contest from Khambhalia seat. ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదన్ గధ్వీ వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో

By Medi Samrat
Published on : 13 Nov 2022 8:00 PM IST

ఆప్ గుజరాత్ ముఖ్యమంత్రి అభ్యర్థి పోటీ చేసేది ఏ స్థానం నుంచో తెలుసా..?

ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదన్ గధ్వీ వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత జిల్లా దేవభూమి ద్వారకలోని ఖంభాలియా స్థానం నుంచి పోటీ చేస్తారని ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రకటించారు. ఈ విషయాన్ని కేజ్రీవాల్ ట్వీట్ ద్వారా ప్రకటించారు. 'రైతులు, నిరుద్యోగ యువత, మహిళలు, వ్యాపారవేత్తల కోసం ఏళ్ల తరబడి తన గళాన్ని వినిపించిన ఇసుదన్ గాధ్వి జామ్ ఖంభాలియా నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారు! శ్రీకృష్ణుడి పుణ్యభూమి నుంచి గుజరాత్‌కు కొత్త, మంచి ముఖ్యమంత్రి వస్తాడు'' అని ఢిల్లీ ముఖ్యమంత్రి హిందీలో ట్వీట్‌ చేశారు.

గాధ్వి స్పందిస్తూ, "మీరు, గుజరాత్ ప్రజలు నాపై ఉంచిన విశ్వాసం, నా చివరి శ్వాస వరకు నేను గుజరాత్ ప్రజలకు సేవ చేస్తానని హామీ ఇస్తున్నాను. జై జై గర్వి గుజరాత్! AAP నిర్వహించిన పోల్ ఫలితాల ఆధారంగా నవంబర్ 4న మాజీ టీవీ జర్నలిస్ట్ గాధ్వి పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపికయ్యారు. పార్టీ గుజరాత్ యూనిట్ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా, ప్రధాన కార్యదర్శి మజోజ్ సొరథియా కూడా రేసులో ఉన్నారు. ద్వారకా జిల్లాకు చెందిన వ్యవసాయ కుటుంబానికి చెందిన గాధ్వి దాదాపు 73 శాతం ఓట్లను పొందారు, రేసులో ఇటాలియా, సొరథియా వెనుకబడ్డారు. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీకి ఇప్పటి వరకు 175 మంది అభ్యర్థుల పేర్లను ఆప్ ప్రకటించింది.


Next Story