ఢిల్లీ మున్సిప‌ల్ ఎన్నిక‌లు.. ఆధిక్యంలో ఆప్‌.. సంబురాల్లో పార్టీ శ్రేణులు

AAP workers dance and celebrate after party wins 106 seats and leads on 26 others.ఢిల్లీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఆమ్ఆద్మీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Dec 2022 1:08 PM IST
ఢిల్లీ మున్సిప‌ల్ ఎన్నిక‌లు.. ఆధిక్యంలో ఆప్‌.. సంబురాల్లో పార్టీ శ్రేణులు

ఢిల్లీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీ హ‌వా కొన‌సాగుతోంది. డిసెంబ‌ర్ 4న 250 వార్డుల‌కు పోలింగ్ జ‌రుగ‌గా బుధ‌వారం ఉద‌యం నుంచి కౌంటింగ్ ప్ర‌క్రియ మొద‌లైంది. కౌంటింగ్ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మ‌ధ్య హోరాహోరీ పోటీ ఉంది.

అయితే.. మ‌ధ్యాహ్నాం 12.30 గంట‌ల వ‌ర‌కు వెలువ‌డిన ఫ‌లితాల్లో ఆమ్ఆద్మీ పార్టీ దూసుకుపోతుంది. ఆప్ 106 స్థానాల్లో విజ‌యం సాధించ‌గా మ‌రో 26 స్థానాల్లో ముందంజ‌లో ఉంది. బీజేపీ 84 స్థానాల్లో గెలుపొందగా 20 స్థానాల్లో ముందంజ‌లో ఉంది. కాంగ్రెస్ 5 స్థానాల్లో విజ‌యం సాధించ‌గా మ‌రో 5 స్థానాల్లో ముందంజ‌లో ఉంది.

ఢిల్లీ మేయ‌ర్ పీఠాన్ని ద‌క్కించుకోవాల‌ని 126 వార్డుల్లో విజ‌యం సాధించాలి. ఇప్ప‌టికే 106 స్థానాల్లో గెలుపొందిన ఆప్ మ‌రో 20 స్థానాలు గెలుచుకుంటే మేయ‌ర్ పీఠం ఆప్ సొంతం అవుతుంది. ప్ర‌స్తుతం 26 స్థానాల్లో ఆప్ ముంద‌జ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

ఆప్ శ్రేణుల సంబ‌రాలు..

ఇప్ప‌టికే వంద‌కు పైగా సీట్ల‌ను గెలుచుకోవ‌డంతో పాటు మ‌రో 26కు పైగా స్థానాల్లో ఆప్ ముందంజ‌లో ఉండ‌డంతో ఆ పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగితేయాయి. పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యం ముందు నేత‌లు, కార్య‌క‌ర్త‌లు డ‌ప్పు చ‌ప్పుళ్ల మ‌ధ్య డ్యాన్సులు చేస్తున్నారు.

Next Story