ఎన్నిక‌ల త‌ర్వాత ఆ పార్టీకి మద్దతు ప్ర‌క‌టించిన‌ 'ఆప్'

తాజాగా జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.

By Medi Samrat  Published on  11 Oct 2024 4:29 PM IST
ఎన్నిక‌ల త‌ర్వాత ఆ పార్టీకి మద్దతు ప్ర‌క‌టించిన‌ ఆప్

తాజాగా జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమికి 48 సీట్లు వచ్చాయి. బీజేపీకి 29 సీట్లు వచ్చాయి. జమ్మూ కాశ్మీర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక సీటు గెలుచుకుంది. దోడా అసెంబ్లీ స్థానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మెహ్రాజ్ మాలిక్ విజయం సాధించారు. ఫలితాల తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేషనల్ కాన్ఫరెన్స్ (NC)కి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్సీపీకి మద్దతు తెలుపుతూ లెఫ్టినెంట్ గవర్నర్‌కు లేఖ సమర్పించింది.

దోడా అసెంబ్లీ స్థానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మెహ్రాజ్ మాలిక్ 4,538 ఓట్లతో విజయం సాధించారు. ఆయనకు మొత్తం 23,228 ఓట్లు వచ్చాయి. భారతీయ జనతా పార్టీకి చెందిన గజయ్ సింగ్ రాణాపై మెహ్రాజ్ మాలిక్ విజయం సాధించారు. బీజేపీకి చెందిన గజయ్ సింగ్ రాణాకు 18,690 ఓట్లు వచ్చాయి.

జమ్మూకశ్మీర్‌లో పదేళ్ల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌సీ-కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. నేషనల్ కాన్ఫరెన్స్‌కు 42, కాంగ్రెస్‌కు 6 సీట్లు వచ్చాయి. కాగా భారతీయ జనతా పార్టీ 29 స్థానాలు, పీడీపీ 3 స్థానాలు గెలుచుకున్నాయి. ఏడు స్థానాలు స్వతంత్ర అభ్యర్థులకు దక్కాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి, జేపీసీకి ఒక్కో సీటు దక్కింది.

గురువారం జరిగిన సమావేశంలో నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేలు ఒమర్ అబ్దుల్లాను తమ నేతగా ఎన్నుకున్నారు. శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన అనంతరం ఒమర్ అబ్దుల్లా ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. నాపై విశ్వాసం వ్యక్తం చేసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించిన పార్టీ ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ కంటే ముందు ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలలో న‌లుగురు కూడా నేషనల్ కాన్ఫరెన్స్‌కు మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత ఎంపిక కోసం శుక్రవారం సమావేశం కానుంది. సమావేశంలో ఎంపిక చేసిన నేత పేరును పార్టీ హైకమాండ్ ఆమోదం కోసం పంపనున్నారు.

పదేళ్ల తర్వాత జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలోని 90 స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. మొదటి దశకు సెప్టెంబర్ 18న, రెండో దశకు సెప్టెంబర్ 25న, చివరి దశకు అక్టోబర్ 1న పోలింగ్ జరిగింది. అక్టోబర్ 8న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.

Next Story