మనీష్ సిసోడియాను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోంది : ఆప్

AAP alleges that there is a conspiracy to kill Manish Sisodia. మనీష్ సిసోడియా ను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆప్ ఆరోపణలు గుప్పించింది

By M.S.R  Published on  8 March 2023 7:01 PM IST
మనీష్ సిసోడియాను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోంది : ఆప్

Manish Sisodia


ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) పార్టీ నాయకుడు మనీష్ సిసోడియా ను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆప్ ఆరోపణలు గుప్పించింది. తీహార్‌ జైలులో ఉన్న ఆయనను చంపడం కోసం కరుడుగట్టిన నేరస్తులు ఉన్న సెల్‌ నంబర్‌ 1లో ఉంచారని ఆప్‌ నేత సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. ఒక అండర్ ట్రయల్ ఖైదీని సెల్ నంబర్ 1లో ఎప్పుడూ ఉంచరని ఆయన అన్నారు. ఆ సెల్‌లో ఉండే వారు చాలా హత్య కేసుల్లో ప్రమేయం ఉండి అరెస్టైన వాళ్లని.. వారిలో కొందరు మానసిక స్థిమితం లేనివారని.. మరో కేసు నమోదైనా ఆ నేరస్తులకు పెద్దగా తేడా ఏమీ ఉండదని సౌరభ్ భరద్వాజ్ చెప్పుకొచ్చారు. మనీష్‌ సిసోడియాను ధ్యానం చేసుకునేందుకు విపాసనా సెల్‌లో ఉంచవచ్చని కోర్టు చెప్పిందని అన్నారు. మనీష్ సిసోడియాకు ప్రాణహాని ఉందని ఆప్‌ ఎంపీ సంజయ్ సింగ్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. సిసోడియాను చూసి మీరు ఎందుకు భయపడుతున్నారు? తొలిసారి అరెస్ట్‌ చేసిన ఖైదీని కరుడుగట్టిన నేరస్థుల వద్ద ఎప్పుడైనా ఉంచారా? అని ప్రశ్నించారు. ఆప్‌ నేత మనీష్‌ సిసోడియాను సీనియర్ సిటిజన్ల సెల్‌లో ఉంచినట్లు జైలు అధికారులు తెలిపారు.


Next Story