10 ఏళ్లు దాటితే ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి.. జూన్‌ 14 వరకు గడువు

మన నిత్య జీవితంలో ఆధార్‌ కార్డు ఎంతో కీలకంగా మారింది. బ్యాంక్‌ అకౌంట్లు తెరిచేందుకు, వెహికల్స్‌, ఇళ్లు, భూములు క్రయవిక్రయాలు, ప్రభుత్వ

By అంజి  Published on  19 May 2023 3:00 PM IST
Aadhaar update, Aadhaar Card, UIDAI, National news

10 ఏళ్లు దాటితే ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి.. జూన్‌ 14 వరకు గడువు

మన నిత్య జీవితంలో ఆధార్‌ కార్డు ఎంతో కీలకంగా మారింది. బ్యాంక్‌ అకౌంట్లు తెరిచేందుకు, వెహికల్స్‌, ఇళ్లు, భూములు క్రయవిక్రయాలు, ప్రభుత్వ స్కీంలు, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యక్రమాలకు, ఇలా ఎన్నో వాటికి ఆధార్‌ కార్డ్ తప్పనిసరిగా మారింది. అయితే ఆధార్‌ తీసుకుని 10 ఏళ్లు గడిస్తే.. తప్పనిసరిగా అప్‌డేట్‌ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రూల్‌ తీసుకొచ్చింది. 2014 కంటే ముందు ఆధార్‌ తీసుకున్న వారు తమ వివరాలను మళ్లీ అప్‌డేట్‌ చేసుకోవాలని యూఐడీఏఐ సూచించింది. ఆధార్‌ అప్డేట్‌కు జూన్‌ 14 వరకు సర్కార్‌ గడువు విధించింది. అలాగే చిన్నారులకు ఆధార్‌ కార్డు తీసుకుని ఐదేళ్లు గడిస్తే.. తప్పనిసరిగా వేలిముద్రలు, ఫొటోలను కూడా అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. పోస్టాఫీసులు, బ్యాంకులు, శాశ్వత ఆధార్‌ కేంద్రాల్లో తగిన డాక్యుమెంట్లు అందజేసి అప్‌డేట్‌ చేసుకోవాలి. 2009లో ఆధార్‌ నమోదు ప్రారంభం కాగా గ్రామాలు, పట్టణాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసి వేలిముద్రలు, కనుపాపలు, ఫొటోలతో ప్రతి ఒక్కరికీ కార్డులను జారీ చేశారు.

ఆధార్‌ అప్‌డేట్‌ ఇలా చేసుకోండి..

- ముందుగా myaadhaar.uidai.gov.in పోర్టల్‌ ఓపెన్‌ చేయండి. ఫోన్‌ నంబర్‌ ఎంటర్‌ చేసిన తర్వాత వచ్చే ఓటీపీతో లాగిన్‌ అవ్వండి.

- ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవడానికి సంబంధిత సర్టిఫికేషన్‌ డాక్యుమెంట్స్‌ను డిపాజిట్ చేసేందుకు డాక్యుమెంట్‌ అప్‌డేట్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

- అందులో పేరు, ఇతర వివరాలను రుజువు చేస్తూ తగిన డాక్యుమెంట్స్‌ను ఆప్‌లోడ్‌ చేయాలి.

- ఆ తర్వాత అడ్రస్‌ నిరూపించేలా మరో ప్రతాన్ని అప్‌లోడ్‌ చేసి సబ్మిట్‌ మీద క్లిక్‌ చేయాలి.

- వెంటనే ఆధార్‌ అప్‌డేట్‌ పూర్తయినట్లు ఫోన్‌ నంబర్‌కు మేసేజ్‌ వస్తుంది.

- ఆధార్‌ అప్‌డేట్‌ కోసం మీ సేవ కేంద్రాల్లో రుసుం వసూలుపై నిబంధనలు జారీ చేశారు.

- బయోమెట్రిక్‌ అప్‌డేట్‌కు రూ.100, డెమోగ్రాఫిక్‌ అప్‌డేట్‌కు రూ.50, ఆధార్‌ డౌన్‌లోడ్‌, కలర్‌ ప్రింట్‌కు రూ.30 చెల్లించాలి.

- ఇందులో ఏమైనా సమస్యలు తలెత్తితే టోల్‌ ఫ్రీ 1947 నంబర్‌ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

Next Story