గుడ్‌న్యూస్‌.. ఆధార్‌ అప్డేట్‌ గడువు పెంపు

ఆధార్‌ కార్డును పదేళ్లుగా అప్డేట్‌ చేసుకోని వారికి కేంద్రం శుభవార్త చెప్పింది. ఉచితంగా అప్డేట్‌ చేసుకునే అవకాశం ఈ నెల 14న ముగియనుండటంతో గడువును పెంచింది.

By అంజి  Published on  12 Sept 2024 1:50 PM IST
Aadhaar card, UIDAI, national news, Aadhaar update

గుడ్‌న్యూస్‌.. ఆధార్‌ అప్డేట్‌ గడువు పెంపు

ఆధార్‌ కార్డును పదేళ్లుగా అప్డేట్‌ చేసుకోని వారికి కేంద్రం శుభవార్త చెప్పింది. ఉచితంగా అప్డేట్‌ చేసుకునే అవకాశం ఈ నెల 14న ముగియనుండటంతో గడువును పెంచుతూ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఆధార్‌ అప్‌డేట్‌ సెంటర్లలో రద్దీ కారణంగా గడువును పొడిగించినట్టు తెలుస్తోంది. తాజా నిర్ణయంతో డిసెంబర్‌ 14వ తేదీ వరకూ ఉచితంగా ఆధార్ అప్డేట్‌ చేసుకోవచ్చని పేర్కొంది. గడువు పూర్తయ్యాక రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఆధార్‌ అప్డేట్‌ చేసుకోకపోయినా అది పని చేస్తుందని యూఐడీఏఐ తెలిపింది.

ఆధార్ సంబంధిత మోసాలను నిరోధించడానికి, UIDAI.. ఆధార్‌ కార్డు తీసుకుని 10 ఏళ్లు గడిచిన అప్‌డేట్‌ చేసుకోని ఆధార్ హోల్డర్‌లను వారి వివరాలను తాజా సమాచారంతో అప్‌డేట్ చేయాలని కోరింది. ఆధార్ కార్డ్ ఇప్పుడు దేశంలో ఒక ముఖ్యమైన గుర్తింపు కార్డుగా మారింది. భారతదేశంలో అనేక సేవలకు ఆధార్ కార్డ్ ముఖ్యమైనదిగా ప్రకటించబడింది. అనేక రంగాల్లో ఆధార్ కార్డులను అనుసంధానం చేయాల్సిన అవసరం కూడా ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వ సేవలు, రాష్ట్ర ప్రభుత్వ సేవలు పొందాలంటే ఆధార్ కార్డు ముఖ్యం. ఈ క్రమంలోనే ఆధార్ కార్డులో మార్పులు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఉచిత ఆన్‌లైన్ సౌకర్యాన్ని కల్పించింది. 10 ఏళ్లుగా ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోని వారు, చిరునామా మారిన వారు, ఆధార్ కార్డులో తప్పు వివరాలు ఉన్నవారు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు.

Next Story