నేడు ఆకాశంలో అద్భుతం.. కనువిందు చేయనున్న సూపర్ బ్లూ మూన్
ఆగష్టు 30 రాత్రి, ఆకాశంలో సూపర్ బ్లూ మూన్ మిమ్మల్ని అలరించనుంది. ఆకాశంలో కొన్ని సంఘటనలు అరుదైనవిగా ఏర్పడుతూ ఉంటాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 Aug 2023 8:30 AM GMTనేడు ఆకాశంలో అద్భుతం.. కనువిందు చేయనున్న సూపర్ బ్లూ మూన్
ఆగష్టు 30 రాత్రి, ఆకాశంలో సూపర్ బ్లూ మూన్ మిమ్మల్ని అలరించనుంది. ఆకాశంలో కొన్ని సంఘటనలు అరుదైనవిగా ఏర్పడుతూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మందిని ఈ ఖగోళ సంఘటనలు ఆకర్షిస్తాయి. ఈ అద్భుతాలలో, 2023 సూపర్ బ్లూ మూన్ ఒక అరుదైన అంశమే..! ఆగస్టు 30న రాత్రిపూట ఆకాశంలో ఓ వింత ఘటన సందడి చేయనుంది. ఆకాశంలో అద్బుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. అరుదైన సూపర్ బ్లూ మూన్ కనిపించనుంది. సాధారణం కన్నా చంద్రుడు పెద్దగా దర్శనం ఇవ్వబోతున్నాడు. బుధవారం రాత్రి 8 గంటలకు సూపర్ బ్లూ మూన్ ఆవిష్కృతం కానుంది. సాధరణంగా ఏడాదిలో రెండు లేదా మూడు సూపర్ మూన్ లు ఏర్పడుతూవుంటాయి. బుధవారం ఏర్పడబోయే సూపర్ బ్లూ మూన్ మాత్రం చాలా అరుదు. ఆ అద్భుతాన్ని ఇప్పుడు చూడకపోతే మళ్లీ 2037 వరకు సూపర్ బ్లూ మూన్ ను మనం చూడలేకపోవచ్చని చెబుతున్నారు.
సూపర్ బ్లూ మూన్ అంటే చంద్రుడు బ్లూ కలర్ లోకి మారడు. చంద్రుడు నీలి రంగులో కనిపిస్తాడా అన్న సందేహం అందరిలోనూ ఉంటుంది. కానీ అసలు నిజం అది కాదు. బ్లూ మూన్ అంటే చంద్రుడు బ్లూ కలర్ లోకి మారడం కాదు. ఒకే నెలలో రెండు పౌర్ణములు వస్తే ఆ పౌర్ణమి నాటి చంద్రుడిని సూపర్ బ్లూ మూన్ అంటారు. చంద్రుడు భూమికి అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు పౌర్ణమి వస్తే ఆ రోజు చంద్రుడిని సూపర్ మూన్ అంటారు. సాధారణంగా 25 శాతం పౌర్ణమి చంద్రుడు సూపర్ మూన్ లుగా మారుతాడు. కానీ కేవలం 3 శాతం పౌర్ణమి చంద్రుడు మాత్రం సూపర్ బ్లూ మూన్ గా మారుతాడు. సూపర్ బ్లూ మూన్ సమయంలో సాధారణంగా పౌర్ణమి నాడు కనిపించే చంద్రుడి కన్నా 16 శాతం కాంతివంతంగా కనిపిస్తాడు. సాధారణం కంటే పెద్దగా కనిపిస్తాడు. ఈ సూపర్ బ్లూ మూన్ ఈ ఏడాదిలో మూడో అతిపెద్ద సూపర్ బ్లూ మూన్. ఈ చంద్రుడు నీలం రంగులో ఉండడు, కానీ మంత్రముగ్ధులను చేసే నారింజ రంగులో కనిపిస్తాడు.
సూపర్ బ్లూ మూన్:
ఈ ఘటన ఖగోళంగా ఎంతో అరుదైనది. దీనిని తరచుగా 'ఒకసారి బ్లూ మూన్'గా వర్ణిస్తారు. సూపర్ బ్లూ మూన్ ఆగస్ట్ 30న సాయంత్రం 7 గంటల 10 నిమిషాల నుంచి ఆకాశంలో ప్రారంభమవుతుంది. ఈ సూపర్ బ్లూ మూన్ ఆగస్ట్ 31 తెల్లవారుజామున 3 గంటల 36 నిమిషాల వరకు ఉంటుంది. చివరిసారిగా బ్లూ బూన్ 2009 డిసెంబర్‌లో ఏర్పడింది.
సీజనల్ బ్లూ మూన్: సాంప్రదాయకంగా, బ్లూ మూన్ నాలుగు పౌర్ణమిలను కలిగి ఉన్న సీజన్‌లో మూడవ పౌర్ణమి అని అంటారు
నెలవారీ బ్లూ మూన్: ఒక క్యాలెండర్ నెలలో వచ్చే రెండవ పౌర్ణమిని బ్లూ మూన్ అంటారు
బ్లూ మూన్ ఇన్ఫ్రీక్వెన్సీ: బ్లూ మూన్‌లు ఖగోళంగా ఎంతో అరుదైనవి.. ఆ రాత్రి ఆకాశంలో ఓ అద్భుతమైన దృశ్యాన్ని మనం చూడబోతున్నాం
దాదాపుగా ప్రతి 29 రోజులకు ఒక పౌర్ణమి వస్తుంది. ఒకే క్యాలెండర్ నెలలో రెండు పౌర్ణమిలు సంభవించడం చాలా అరుదు. సగటున, బ్లూ మూన్‌లు ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి మాత్రమే దర్శనం ఇస్తాయి. ఆశ్చర్యకరంగా, 2018లో కేవలం రెండు నెలల వ్యవధిలో రెండు బ్లూ మూన్ లను చూసింది. చంద్రుడు భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతూ ఉంటాడు. ఇలా తిరిగే క్రమంలో చంద్రుడు కొన్ని సార్లు భూమికి తక్కువ దూరంలో ఉంటాడు దీన్ని పెరజీ అని, దూరంగా పాయింట్ ను అపోజీగా పేర్కొంటారు. ఆగస్టు 30న చంద్రుడు భూమికి దగ్గర రాబోతున్నాడు. ఈ సమయంలో చంద్రుడు సాధారణం కన్నా 14 శాతం పెద్దదిగా కనిపించబోతున్నాడు. ఈ ఖగోళ అద్భుతం తర్వాత జనవరి, మార్చి 2037లో జరగనుంది. కాబట్టి మీరు కూడా ఈసారి ఈ సూపర్ బ్లూ మూన్ ను ఎంజాయ్ చేయాలని మేము కోరుకుంటూ ఉన్నాం.