వ్యాక్సిన్ వేస్తామంటే తల పగలగొట్టారు.. ఎక్కడంటే..

A Medical Team Was Attacked In Malikhedi Village. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని సమీపంలోని మాలిఖేరి గ్రామం లో కరోనా వ్యాక్సిన్ ఇవ్వడానికి వచ్చిన ప్రతినిధులపై కొంతమంది దాడి చేశారు.

By Medi Samrat  Published on  24 May 2021 12:43 PM GMT
medical team injured

దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఈ మహమ్మారికి అడ్డుకట్టవేయాలంటే.. మాస్క్, శానిటైజర్, సామాజిక దూరం పాటించిడం ఒక్కటే సరిపోదు కదా.. దానితో పాటూ వ్యాక్సినేషన్ కూడా జరగాల్సిందే. అయితే మారుమూల ప్రాంతాల్లోని జనాల్లో ఇప్పటికీ వాక్సిన్ అంటే ఒక భయం కొనసాగుతూనే ఉంది.

ఒకప్పుడు ప్రపంచంలో మహమ్మారి అనే పదానికి మీనింగ్ చెప్పిన భయంకరమైన జబ్బు మశూచి.. కోట్లాది మందిని పొట్టనపెట్టుకుంది. అలాంటి జబ్బుకు విరుగుడుగా అందుబాటులోకి టీకా వచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా ఉద్యమాలే జరిగాయి. తట్టు, గవదబిళ్లల, కోరింత దగ్గు, మీజిల్స్‌ నిరోధానికి టీకా ఇస్తామన్నప్పుడు కూడా వద్దు వద్దంటూ అధికారులు వచ్చే సమయానికి ఊళ్లకు ఊళ్లే ఖాళీ చేసేసారు. శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయాసలకోర్చి తయారు చేసిన ప్రతి వ్యాక్సిన్‌పైనా జనం మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉండేవారన్నది నిజం. అయితే ఇప్పుడు మనం 21 వ శతాబ్దంలో వున్నాం. సైన్స్ చాలా అభివృద్ధి చెందింది. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా సైన్స్ పట్ల ఇంకా వ్యతిరేకత, భయం ఉండిపోయింది.

దేశంలో ఒకవైపు కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం చాలా మంది నిరీక్షిస్తుండగా.. మరోవైపు వ్యాక్సిన్ వేసేందుకు గ్రామానికి వచ్చిన అధికారుల బృందాన్ని చూసి గ్రామస్థులు నదిలోకి దూకి పారిపోయిన సంఘటన యూపీలోని బారాబంకీ గ్రామంలో జరిగింది. గ్రామస్థులంతా నదిలో దూకి పారిపోగా, కేవలం 14 మంది మాత్రమే కొవిడ్ టీకాలు వేయించుకున్నట్లు ఇక్కడ అధికారులు వెల్లడించారు.

మరోవైపు మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని సమీపంలోని మాలిఖేరి గ్రామం లో కరోనా వ్యాక్సిన్ ఇవ్వడానికి వచ్చిన ప్రతినిధులపై కొంతమంది దాడి చేశారు. ఆరోగ్య శాఖ బృందం సోమవారం ఉదయం మొబైల్ వ్యాన్‌తో మాలిఖేరి గ్రామానికి వచ్చింది. ఈ బృందంలో తహశీల్దార్, ఆశా వర్కర్ తో పాటూ వ్యాక్సినేటర్ మరియు ఇతర ఉద్యోగులు ఉన్నారు. ప్రజలను టీకాలు వేసుకోవడానికి పిలిచినప్పుడు వారు నిరాకరించడం తో పాటూ వచ్చినవారిని గ్రామం నుంచి బయటకు వెళ్ళాల్సిందిగా కోరారు. అయితే అధికారులు మరోసారి ప్రజలకు చెప్పటానికి ప్రయత్నించడంతో ప్రజలు వారిపై ఎదురుతిరిగారు. అధికారులను రక్తం వచ్చేలా కొట్టడంతో రంగం లోకి దిగిన పోలీసులు నలుగురు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.



Next Story