శ్మశానంలో అర్ధరాత్రి పుట్టిన రోజు వేడుక.. ఫ్రెండ్స్‌కు, గెస్ట్‌లకు బిర్యానీ పార్టీ

A Maharashtra man who celebrated his birthday in a cremation ground. సాధారణంగా ఎవరైనా తమ పుట్టిన రోజు వేడుకలను ఇంట్లోనో లేదంటే బయట రెస్టారెంట్లలలోనే,

By అంజి  Published on  24 Nov 2022 4:03 PM IST
శ్మశానంలో అర్ధరాత్రి పుట్టిన రోజు వేడుక.. ఫ్రెండ్స్‌కు, గెస్ట్‌లకు బిర్యానీ పార్టీ

సాధారణంగా ఎవరైనా తమ పుట్టిన రోజు వేడుకలను ఇంట్లోనో లేదంటే బయట రెస్టారెంట్లలలోనే, పార్కుల్లోనో సెలబ్రెట్‌ చేసుకుంటారు. అయితే ఈ వ్యక్తి మాత్రం కాస్త తన పుట్టిన రోజును కాస్తా డిఫరెంట్‌గా జరుపుకోవాలనుకున్నాడు. అందుకు శ్మశాన వాటికను ఎంచుకున్నాడు. అక్కడే తన పుట్టిన రోజు జరుపుకుని వచ్చిన ఫ్రెండ్స్‌, గెస్ట్‌లకు బిర్యానీ పార్టీ ఇచ్చాడు. రాత్రి సమయంలో నిర్వహించిన ఈ వేడుకలకు మహిళలు, చిన్నపిల్లలు కూడా వచ్చారు. ఈ విచిత్ర ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగింది. కళ్యాణ్ పట్టణంలో నివసిస్తున్న ఒక వ్యక్తి శనివారం రాత్రి శ్మశానవాటికలో తన బర్త్‌ డే సెలబ్రేషన్‌ చేసుకున్నాడు.

ఠాణె జిల్లాకు చెందిన గౌతమ్ రత్నా మోర్ అనే వ్యక్తి భిన్నంగా బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ చేసుకున్నాడు. నవంబరు 19న తన 54వ పుట్టినరోజు వేడుకలను స్థానిక శ్మశానంలో నిర్వహించాడు. శనివారం రాత్రి సమయంలో ఈ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు 40మంది మహిళలు, చిన్నపిల్లలతో సహా 100మంది వచ్చారు. గౌతమ్‌.. శ్మశానంలోనే కేక్ కోసి పుట్టినరోజు జరుపుకున్నాడు. వచ్చిన గెస్ట్‌లకు శ్మశానంలోనే బిర్యానీ, కేక్ వడ్డించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

సమాజంలో ఉన్న అంధవిశ్వాసాలను, మూఢనమ్మకాలను రూపుమాపేందుకే ఇలా కొత్తగా ఆలోచించానని గౌతమ్‌ చెప్పాడు. అంధవిశ్వాసాలు, చేతబడి, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా.. ప్రముఖ సామాజిక కార్యకర్త సింధుతాయ్ సప్కల్, ప్రముఖ హేతువాది దివంగత నరేంద్ర దభోల్కర్​లు చేసిన ప్రచారాలతో తాను ప్రేరణ పొందానని చెప్పాడు. ఇందు కోసమే వేడుకలను స్మశానంలో నిర్వహించానని చెప్పారు. దెయ్యాలు, భూతాలు వంటి వాటి ఉనికి లేదని ప్రజలకు తెలియజేయాలని ఇలా చేశానని మోర్ తెలిపారు.

Next Story