అయ్యో పాపం.. ఒకేదగ్గర ట్యూషన్ వెళ్లారు.. కరోనా తగిలించుకున్నారు.. ఎంతమందో తెలుసా?
91 Kerala Students Who Tested Positive Went To Same Tuition Centre. తాజాగా ఒకే ట్యూషన్‌కు వెళ్లిన 91 మంది విద్యార్థులకు కరోనాసోకిన ఘటన కేరళలో జరిగింది
By Medi Samrat Published on 10 Feb 2021 12:09 PM GMTప్రపంచంలో ఏ ముహూర్తంలో కరోనా వైరస్ ప్రతాపాన్ని చూపించడం మొదలు పెట్టిందో కానీ ఆర్థిక, ప్రాణ నష్టం భారీగా చోటు చేసుకుంది. కరోనా వైరస్ వల్ల ఎక్కువగా నష్టపోయింది ఎంటర్ టైన్ మెంట్ వ్యవస్థ ఒకటైతే.. రెండోది విద్యావ్యవస్థ. కరోనా భయం తో పిల్లలను స్కూళ్లకు, కాలేజీలకు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. ఈ మద్యనే దేశంలో పాఠశాలలు మళ్లీ తెరుచుకోవడం మొదలయ్యాయి. 9,10 నుంచి పీజీ వరకు విద్యార్థులు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితం అయ్యారు విద్యార్థులు. లాక్ డౌన్ సడలించిన తర్వాత ఆన్ లైన్ క్లాసులు నిర్వహించారు.
ఇటీవల పాఠశాలకు వెళ్లిన విద్యార్థులకు కరోనా రావడం కలకలం రేపింది. తాజాగా ఒకే ట్యూషన్‌కు వెళ్లిన 91 మంది విద్యార్థులకు కరోనాసోకిన ఘటన కేరళలో జరిగింది. అయితే ఆ స్కూల్ లో చదువుతున్న 192 మంది విద్యార్థులకు పాజిటీవ్ అని తేలింది. అందులో 91 మంది ప్రతిరోజూ ఒకే ట్యూషన్‌కు వెళ్తారని తేలింది. ఇక కరోనా పాజిటివ్‌గా తేలిన 192 మందిలో 91 మంది విద్యార్థులు ఒకే ట్యూషన్ సెంటర్‌కు హాజరయ్యారు. ప్రస్తుతం అక్కడి పోలీసులు ట్యూషన్ సెంటర్ ని సీజ్ చేశారు. మితగా కొంత మంది విద్యార్థులను హోం ఐసోలేషన్‌లో ఉండాలని ఆదేశించారు. వారికి కూడా కరోనా టెస్టులు చేస్తారని ఎడ్యుకేషన్ ఆఫీసర్ రమేష్ కుమార్ తెలిపారు.
అయితే కరోనా పాజిటీవ్ తేలిన రెండు పాఠశాలలను మూడు రోజుల పాటు మూసివేస్తారని.. పూర్తిగా శానిటైజేషన్ చేస్తారని అన్నారు. విద్యార్థులనే కాదు ఉపాధ్యాయులు, చుట్టుపక్కల ప్రాంతాల 2 వేల మందికి పరీక్షలు చేస్తామని జిల్లా వైద్య అధికారి డాక్టర్ సకీనా తెలిపారు. కాగా, అనుమానం వచ్చిన నేపథ్యంలతో ఒక పాఠశాలలో ఒక విద్యార్థి మరియు మరొక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు పాజిటివ్‌గా పరీక్షించారు. వారిలో 192 మందికి పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల కాంటాక్ట్ ట్రేసింగ్ మరియు టెస్టింగ్ కొనసాగుతుంది.