విదేశాల్లో మెడిసన్‌ చదువుతున్న విద్యార్థులపై.. కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

90% Studying Medicine Abroad Fail To Clear Qualifiers In India.. Minister Pralhad Joshi. విదేశాల్లో మెడిసిన్ చదివే 90 శాతం మంది భారతీయులు భారత్‌లో అర్హత పరీక్షల్లో విఫలమవుతున్నారని

By అంజి  Published on  2 March 2022 8:13 AM GMT
విదేశాల్లో మెడిసన్‌ చదువుతున్న విద్యార్థులపై.. కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

విదేశాల్లో మెడిసిన్ చదివే 90 శాతం మంది భారతీయులు భారత్‌లో అర్హత పరీక్షల్లో విఫలమవుతున్నారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వివాదాస్పదంగా పేర్కొన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి మాట్లాడుతూ.. "విద్యార్థులు మెడిసిన్ చదవడానికి ఎందుకు వెళుతున్నారో చర్చించడానికి ఇది సరైన సమయం కాదు" అని అన్నారు. విదేశాల్లో మెడికల్ డిగ్రీ పొందిన వారు భారతదేశంలో మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ లో ఉత్తీర్ణులు కావాలన్నారు. అప్పుడే వారికి స్వదేశంలో ప్రాక్టీస్‌కు అనుమతి ఉంటుంది.

ఉక్రెయిన్‌లో వేలాది మంది భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయిన నేపథ్యంలో మిస్టర్ జోషి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రష్యాపై దాడి చేస్తున్న దళాలతో తీవ్ర యుద్ధం జరుగుతోంది. అయితే కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలు పలువురు విద్యార్థులు స్పందిస్తూ.. భారత్‌లో మెడికల్‌ మెడికల్‌ సీట్లు తక్కువగా ఉన్నాయన్నారు. అలాగే నీట్‌ ఎగ్జామ్‌ రాసి ఉత్తీర్ణత సాధించిన సీట్లు రావడం లేదని స్పష్టం చేశారు. విదేశాల్లో మెడిసన్‌ చదివే విద్యార్థులు భారత్‌లో ప్రాక్టీస్‌ చేయకపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని, భారత్‌లో మెడిసన్‌ చదివే విద్యార్థులు.. దేశ జనాభాకు సరిపోరని పేర్కొన్నారు.

గత గురువారం ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ప్రారంభమైంది. దేశం విడిచి వెళ్ళడానికి నిరాశగా ఉన్న విద్యార్థుల నుండి వీడియోలు వెల్లువెత్తుతున్నాయి. తక్షణ సాయం కోరుతూ రైళ్లను ఎక్కేందుకు అనుమతించడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. తమను మానవహారంగా చేసి, భౌతికంగా రైళ్ల నుంచి బయటకు పంపిస్తున్నారని చెప్పారు. నిన్న ఖార్కివ్‌లో రష్యా షెల్లింగ్‌లో కర్ణాటకకు చెందిన 21 ఏళ్ల విద్యార్థి ఒకరు మరణించారు. ఇదిలా ఉంటే విద్యార్థులను క్షేమంగా స్వదేశానికి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది.

Next Story