ట్రెక్కింగ్‌లో విషాదం.. దారి తప్పి 9 మంది మృతి
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలోని సహస్త్ర తాల్ ఆల్ఫైన్ సరస్సు వద్దకు వెళుతుండగా ప్రతికూల వాతావరణం కారణంగా దారి తప్పి చిక్కుకుని 9 మంది మరణించారు
By అంజి Published on 5 Jun 2024 5:15 PM ISTట్రెక్కింగ్‌లో విషాదం.. దారి తప్పి 9 మంది మృతి
22 మంది సభ్యుల బృందంలోని తొమ్మిది మంది ట్రెక్కర్లు ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలోని సహస్త్ర తాల్ ఆల్ఫైన్ సరస్సు వద్దకు వెళుతుండగా ప్రతికూల వాతావరణం కారణంగా దారి తప్పి చిక్కుకుని మరణించారు. జాయింట్ ఎయిర్-గ్రౌండ్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించబడింది. ఇప్పటివరకు పదమూడు మంది ట్రెక్కర్‌లను రక్షించినట్లు ఏఎన్‌ఐ రిపోర్ట్ చేసింది. ప్రతికూల వాతావరణం కారణంగా, హెలికాప్టర్లు, రెస్క్యూలో భాగంగా, ఆపరేషన్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండు చీత్ హెలికాప్టర్లు, రాష్ట్ర విపత్తు రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగాయి. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే, బుధవారం ఉదయం ఒక బృందాన్ని పంపి వారిలో ఆరుగురిని రక్షించారు.
హిమాలయన్ వ్యూ ట్రెక్కింగ్ ఏజెన్సీ, మనేరి ద్వారా 22 మంది సభ్యుల ట్రెక్కింగ్ బృందాన్ని మే 29న ఉత్తరకాశీ నుండి 35 కి.మీ.ల దూరం ప్రయాణించేందుకు పంపారు. ఈ బృందంలో కర్ణాటకకు చెందిన 18 మంది ట్రెక్కర్లు, మహారాష్ట్రకు చెందిన ఒకరు, ముగ్గురు స్థానిక గైడ్‌లు ఉన్నారని ఉత్తరకాశీ జిల్లా మేజిస్ట్రేట్ మెహర్బన్ సింగ్ బిష్త్ తెలిపారు. ట్రెక్కర్లు జూన్ 7 నాటికి తిరిగి రావాల్సి ఉంది, అయితే వారు చివరి బేస్ క్యాంప్ నుండి సహస్త్రాటల్‌కి చేరుకునేటప్పుడు ప్రతికూల వాతావరణం కారణంగా దారి తప్పిపోయారని బిష్త్ చెప్పారు. ఒంటరిగా ఉన్న ట్రెక్కర్‌లను రక్షించడానికి మరియు మరణించిన వారి మృతదేహాలను వెలికితీసేందుకు హెలి-రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాలని తాను ఇండియా ఎయిర్ ఫోర్స్‌ను అభ్యర్థించినట్లు జిల్లా మేజిస్ట్రేట్ చెప్పారు.