జమ్ము కశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి.. 8 మందికి తీవ్రగాయాలు

9 killed, 8 injured as bus falls into gorge in J&K. జమ్ముకశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది.

By అంజి  Published on  14 Sept 2022 11:02 AM IST
జమ్ము కశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి.. 8 మందికి తీవ్రగాయాలు

జమ్ముకశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు సావ్జియాన్‌ నుంచి మండికి వెళ్తుండగా పూంచ్‌ జిల్లాలోని బరేరి నల్ల సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం చెరవేశారు. పోలీసులు, ఆర్మీ, స్థానికులు అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ఓ ట్వీట్‌లో.. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. "పూంచ్‌లోని సావ్జియాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి.'' అని ఆకాక్షించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షలు అందజేయనున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని అధికారులను ఆదేశించారు.



Next Story