ఒకే జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో ఒకరికి కాదు ఇద్దరికి కాదు.. ఏకంగా 85 మందికి హెచ్ఐవీ (హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్) సోకడం కలకలం రేపుతోంది. అసోంలోని నౌగావ్ జిల్లా కేంద్ర కారాగారంలో ఈ ఘటన వెలుగుచూసింది. గత నెలలో(సెప్టెంబర్)లో అక్కడి ఖైదీలకు హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించగా.. 85 మంది పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇంత మందిలో వైరస్ సోకడంపై అధికారులు ఒక్కసారిగా షాక్‌కు గురైయ్యారు.
అయితే.. ఆ ఖైదీలంతా మత్తుపదార్థాలు(డ్రగ్స్)కు అలవాటు పడ్డవారేనని స్థానిక వైద్యాధికారులు వెల్లడించారు. డ్రగ్స్ తీసుకునేటప్పుడు వాడే సిరంజిల కారణంగానే ఇంత మందికి వైరస్ సోకి ఉండవచ్చునని వారు చెబుతున్నారు. కాగా.. ఖైదీలకు హెచ్ఐవీ సోకడాన్ని జైలు అధికారులు కూడా ధృవీకరించారు.