బోరుబావిలో ప‌డిన 8 ఏళ్ల బాలుడి ఘ‌ట‌న విషాదాంతం

8 Year old boy who fell into 400 ft borewell in MP dies.మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని బేతుల్ జిల్లాలో 8 ఏళ్ల బాలుడు బోరుబావిలో ప‌డిన ఘ‌ట‌న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Dec 2022 8:59 AM IST
బోరుబావిలో ప‌డిన 8 ఏళ్ల బాలుడి ఘ‌ట‌న విషాదాంతం

మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని బేతుల్ జిల్లాలో 8 ఏళ్ల బాలుడు బోరుబావిలో ప‌డిన ఘ‌ట‌న విషాదాంతంగా ముగిసింది. ఆ బాలుడు మ‌ర‌ణించాడు.

డిసెంబరు 6న బేతుల్ జిల్లాలోని మాండ‌వి గ్రామంలో 8 ఏళ్ల తన్మయ్ సాహు ఆడుకుంటూ 400 అడుగుల లోతున్న బోరు బావిలో ప‌డిపోయాడు. కుమారుడు క‌నిపించ‌క‌పోవ‌డంతో అత‌డి కోసం త‌ల్లిదండ్రులు వెతుకుతుండ‌గా బోరు బావిలోంచి శ‌బ్దాలు రావ‌డం గ‌మ‌నించారు. వెంట‌నే అధికారులు, పోలీసుల‌కు స‌మాచారం అందించారు. హుటాహూటిన అక్క‌డ‌కు చేరుకున్న అధికారులు రెస్క్యూ ఆప‌రేష‌న్‌ను ప్రారంభించారు.

బాలుడికి ఆక్సిజ‌న్ అందేందుకు ట‌న్నెల్‌లో ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా కోసం ఏర్పాటు చేశారు. రాష్ట్ర విప‌త్తు ప్ర‌తిస్పంద‌న ద‌ళం నాలుగు రోజులుగా రెస్క్యూ ఆప‌రేష‌న్‌ను చేప‌ట్టారు. బోరుబావికి స‌మాంత‌రంగా ఓ గొయ్యిని తవ్వారు. 65 గంటలకు పైగా రెస్క్యూ ఆపరేషన్ త‌ర‌వాత 55 అడుగుల లోతులో చిక్కుకున్న బాలుడిని బ‌య‌ట‌కు తీశారు. అయితే.. అప్ప‌టికే బాలుడు మ‌ర‌ణించాడు. త‌న్మ‌య్ మృత‌దేహాన్ని బేతుల్ జిల్లా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

అంత‌క‌ముందు బాలుడి త‌ల్లి జ్యోతి సాహు త‌న కుమారుడిని ర‌క్షించాల‌ని వేడుకుంది. నా బిడ్డ‌ను త్వ‌ర‌గా బ‌య‌ట‌కు తీయండి. అదే ఒక నాయ‌కుడు లేదా అధికారి బిడ్డ అయితే ఇంత స‌మ‌యం ప‌ట్టేదా అంటూ ఆమె ప్ర‌శ్నించింది.

బాలుడి మృత‌దేహాన్ని చూసిన అనంత‌రం అత‌డి త‌ల్లిదండ్రుల రోద‌న వ‌ర్ణ‌నాతీతంగా మారింది.

Next Story