కెమికల్స్‌ కలిపిన హోలీ రంగులు చల్లడంతో.. 8 మంది విద్యార్థినులు ఆసుపత్రి పాలు

కర్ణాటకలోని గడగ్ జిల్లాలోని లక్ష్మేశ్వర్ పట్టణంలో హోలీ జరుపుకుంటున్న ఎనిమిది మంది పాఠశాల విద్యార్థినులపై గుర్తు తెలియని దుండగులు రసాయనాలు కలిపిన రంగులు చల్లడంతో వారు ఆసుపత్రి పాలయ్యారు.

By అంజి
Published on : 15 March 2025 6:24 AM IST

schoolgirls, hospitalised, unknown men, chemical-laced Holi colours

కెమికల్స్‌ కలిపిన హోలీ రంగులు చల్లడంతో.. 8 మంది విద్యార్థినులు ఆసుపత్రి పాలు

కర్ణాటకలోని గడగ్ జిల్లాలోని లక్ష్మేశ్వర్ పట్టణంలో హోలీ జరుపుకుంటున్న ఎనిమిది మంది పాఠశాల విద్యార్థినులపై గుర్తు తెలియని దుండగులు రసాయనాలు కలిపిన రంగులు చల్లడంతో వారు ఆసుపత్రి పాలయ్యారు. ఈ దాడి తర్వాత, బస్ స్టాండ్ వద్ద వేచి ఉన్న బాధితులకు ఛాతీ నొప్పి, ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. ఆ వ్యక్తుల బృందం మోటార్ సైకిళ్లపై వచ్చి, బస్టాండ్ దగ్గర ఆగి, విద్యార్థులపై రంగులు చల్లడం ప్రారంభించింది. దాడి చేసిన వారు ప్రత్యేకంగా ఎనిమిది మంది బాలికలను లక్ష్యంగా చేసుకుని, రసాయనాలు కలిపిన రంగులు పోసి, అక్కడి నుండి పారిపోయారు.

బాలికలకు అకస్మాత్తుగా ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన ఛాతీ నొప్పి వస్తున్నాయి. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆసుపత్రిని సందర్శించిన సీనియర్ పోలీసు అధికారులు, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని కుటుంబాలకు హామీ ఇచ్చారు.

రసాయనాలతో కూడిన రంగులలో ఆవు పేడ, గుడ్లు, ఫినాల్, సింథటిక్ రంగుల ప్రమాదకరమైన మిశ్రమం ఉందని ప్రాథమిక ఫోరెన్సిక్ దర్యాప్తులో తేలింది. బాధితులు తెలియకుండానే ఆ పదార్థాన్ని కొద్ది మొత్తంలో పీల్చడం, తీసుకోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తీవ్రమైన ప్రతిచర్యలు సంభవించాయి.

Next Story