ఘోర ప్రమాదం.. రాతి క్వారీ కూలి 8 మంది మృతి, 12 మంది గల్లంతు

8 labourers killed in stone quarry collapse in Mizoram. మిజోరాంలోని హ్నాథియాల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మౌదర్ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం

By అంజి  Published on  15 Nov 2022 12:09 PM IST
ఘోర ప్రమాదం.. రాతి క్వారీ కూలి 8 మంది మృతి, 12 మంది గల్లంతు

మిజోరాంలోని హ్నాథియాల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మౌదర్ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం రాతి క్వారీ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో క్వారీ కింద పడి పలువురు మృతి చెందగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం 2:40 గంటల ప్రాంతంలో మౌదర్ ప్రాంతంలో జరిగింది. మరో 12 మంది కార్మికులు ఇంకా చిక్కుకున్నట్లు తెలుస్తోంది. 12 మంది కార్మికులలో.. నలుగురు ఏబీసీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగులు, ఎనిమిది మంది కాంట్రాక్టర్ ఉద్యోగులు ఉన్నారు.

జిల్లా యంత్రాంగం తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం ఇద్దరు అధికారులు, 13 మంది సిబ్బందితో కూడిన జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్‌) బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. అస్సాం రైఫిల్స్,బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి చెందిన సైనికులు స్థానిక పోలీసులతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతదేహాలను గుర్తించిన తర్వాత పోస్ట్‌మార్టం పరీక్ష కోసం తీసుకువెళతామని హ్నాథియల్ జిల్లా అదనపు డిప్యూటీ కమిషనర్ సైజిక్‌పుయి తెలిపారు. తప్పిపోయిన వారందరినీ కనుగొనే వరకు రెస్క్యూ కొనసాగుతుందని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ తెలిపింది. ఐదు ఎర్త్ ఎక్స్‌కవేటర్లు, స్టోన్ క్రషర్, డ్రిల్లింగ్ మెషిన్ కూడా పూర్తిగా శిథిలాల కింద కూరుకుపోయినట్లు ఓ అధికారి తెలిపారు.


Next Story