దారుణం.. పార్కింగ్ వివాదం.. త‌ల్లి ప్రాణాన్ని తీశాడు

76 Year old woman dies after being slapped by son in delhi. పార్కింగ్ విష‌యంలో పొరుగువారితో త‌ల్లి గొడ‌వ ప‌డ‌గా.. అక్క‌డికి వ‌చ్చిన ఆమె కొడుకు.. త‌ల్లినే కొట్టాడు. దీంతో ఆ వృద్దురాలు ప్రాణాలు కోల్పోయింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 March 2021 6:37 AM GMT
76 Year old woman dies after being slapped by son in delhi

పొరుగింటి వారితో ఏర్ప‌డిన పార్కింగ్ వివాదం కాస్త ఓ త‌ల్లి మ‌ర‌ణానికి కార‌ణ‌మైంది. పార్కింగ్ విష‌యంలో పొరుగువారితో త‌ల్లి గొడ‌వ ప‌డ‌గా.. అక్క‌డికి వ‌చ్చిన ఆమె కొడుకు.. త‌ల్లినే కొట్టాడు. దీంతో ఆ వృద్దురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ ఘ‌ట‌న ఢిల్లీలో చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న అంతా అక్క‌డే ఉన్న సీసీకెమెరాలో రికార్డు అయింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. ఢిల్లీ ద్వారకా ప్రాంతంలో అవ్‌తార్‌ కౌర్ (76) అనే వృద్ధురాలు తన కొడుకు, కోడలుతో క‌లిసి ఉంటోంది.

సోమ‌వారం పార్కింగ్ స్థ‌లం విష‌య‌మై కౌర్‌కు ప‌క్కంటి వారికి మ‌ధ్య చిన్న గొడ‌వ మొద‌లైంది. చిన్న గొడ‌వ కాస్త పెద్ద‌దిగా మారింది. ఈ క్ర‌మంలో పొరుగింటి వారు పోలీసుల‌కు కాల్ చేశారు. ఇదే స‌మ‌యంలో కౌర్ కుమారుడు, కోడ‌లు అక్క‌డికి వ‌చ్చారు. జ‌రుగుతున్న గొడ‌వ‌ను చూశారు. కౌర్ కార‌ణంగా.. అన‌వ‌స‌రంగా పొరుగింటి వారితో మాట‌లు ప‌డాల్సి వ‌స్తుంద‌ని ఆగ్ర‌హానికి గురైయ్యాడు. దీంతో కౌర్ చెంప‌పై బ‌లంగా కొట్టాడు. దెబ్బ బ‌లంగా త‌గ‌ల‌డంతో కౌర్ కింద ప‌డిపోయింది. ప‌క్క‌నే ఉన్న కోడ‌లు ఆమెను లేప‌డానికి ప్ర‌య‌త్నించినా ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది.

అప్ప‌టికే ఆ వృద్దురాలు ప్రాణాలు కోల్పోయింది. అక్క‌డికి చేరుకున్న పోలీసులు పొరుగింటి వారితో పాటు కౌర్ కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మొత్తం ఘ‌ట‌న అంతా అక్క‌డే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. నెటీజ‌న్లు స‌ద‌రు కుమారుడిపై మండిప‌డుతున్నారు.


Next Story
Share it