ఘోర ప్ర‌మాదం.. లిఫ్ట్ కూలి ఏడుగురు దుర్మ‌ర‌ణం

7 Dead as under-construction building lift collapses in Ahmedabad.నిర్మాణంలో ఉన్న ఓ భ‌వ‌నంలో లిఫ్ట్ కూలి ఏడుగురు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Sep 2022 9:02 AM GMT
ఘోర ప్ర‌మాదం.. లిఫ్ట్ కూలి ఏడుగురు దుర్మ‌ర‌ణం

గుజ‌రాత్ రాష్ట్రంలో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భ‌వ‌నంలో లిఫ్ట్ కూలి ఏడుగురు మ‌ర‌ణించారు. ఓ వ్య‌క్తి తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు.

వివ‌రాల్లోకి వెళితే.. అహ్మదాబాద్ న‌గ‌రంలో గుజరాత్ యూనివర్శిటీ సమీపంలో ఓ భ‌వ‌నం నిర్మాణంలో ఉంది. ఈ భ‌వ‌నానికి ఆస్పైర్ 2 అని పేరు పెట్టారు. బుధ‌వారం ఉద‌యం ఏడో అంత‌స్తు నుంచి లిఫ్ట్ కూలి కింద‌ప‌డిపోయింది. ఆ స‌మ‌యంలో లిఫ్ట్‌లో ఎనిమిది మంది కార్మికులు ఉన్నారు. వీరిలో ఏడుగురు ఘ‌ట‌నాస్థ‌లంలోనే మృతి చెందారు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే అధికారులు, పోలీసులు అక్క‌డ‌కు చేరుకున్నారు. క్ష‌త‌గాత్రుడిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. మృతుల‌ను అశ్విన్‌భాయ్ సోంభాయ్ నాయక్, ముఖేష్ భరత్‌భాయ్ నాయక్, సంజయ్‌భాయ్ బాబుభాయ్ నాయక్, జగదీష్‌భాయ్ రమేష్‌భాయ్ నాయక్, ముఖేష్‌భాయ్ భరత్‌భాయ్ నాయక్, రాజ్‌మల్ సురేష్‌భాయ్ ఖరాడీ మరియు పంకజ్‌భాయ్ శంకర్‌భాయ్ ఖరాడీగా గుర్తించారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Next Story