అదుపు తప్పి లోయలోపడ్డ టెంపో వాహనం.. ఏడుగురు మృతి

7 dead, 10 hurt after vehicle falls into gorge in Himachalpradesh. హిమాచల్‌ప్రదేశ్‌లో కులులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టూరిస్ట్‌లతో వెళ్తున్న టెంపో ట్రావెలర్‌ వెహికల్‌ అదుపు

By అంజి  Published on  26 Sep 2022 3:17 AM GMT
అదుపు తప్పి లోయలోపడ్డ టెంపో వాహనం.. ఏడుగురు మృతి

హిమాచల్‌ప్రదేశ్‌లో కులులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టూరిస్ట్‌లతో వెళ్తున్న టెంపో ట్రావెలర్‌ వెహికల్‌ అదుపు తప్పి లోయలో పడింది. బంజర్ సబ్‌డివిజన్‌లోని ఘియాఘి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో టెంపోలో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లకు చెందిన వారని అధికారులు తెలిపారు.

''కులులోని బంజర్‌ వ్యాలీలోని ఘియాగి ప్రాంతంలో ఆదివారం రాత్రి 8:30 గంటలకు పర్యాటక వాహనం కొండపై నుంచి బోల్తా పడడంతో ఏడుగురు మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు. గాయపడిన ఐదుగురిని కులు జోనల్ ఆసుపత్రికి తరలించారు. బంజర్‌లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.'' అని ఎస్పీ గురుదేవ్ సింగ్ తెలిపారు. బంజార్‌లోని బిజెపి ఎమ్మెల్యే సురేందర్ శౌరీ అర్ధరాత్రి 12.45 గంటలకు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఫేస్‌బుక్ లైవ్‌లో వీడియో ప్రసారం చేయడం ద్వారా ప్రమాదం గురించి తెలియజేశారు. చీకటి ఉన్నప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినందుకు జిల్లా యంత్రాంగం మరియు స్థానికులకు శౌరి కృతజ్ఞతలు తెలిపారు.


Next Story