మైనర్‌గా ఉన్నప్పుడు 64 మంది అత్యాచారం, కేరళలో పోలీసులకు యువతి ఫిర్యాదు
కేరళలో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. తనపై గత ఐదేళ్లలో 64 మందికి పైగా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
By Knakam Karthik Published on 11 Jan 2025 1:08 PM ISTమైనర్‌గా ఉన్నప్పుడు 64 మంది అత్యాచారం, కేరళలో పోలీసులకు యువతి ఫిర్యాదు
కేరళలో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. తనపై గత ఐదేళ్లలో 64 మందికి పైగా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను 13 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడే ఇదంతా జరిగిందని పేర్కొంది.
మహిళా సమాఖ్య అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన సభ్యులు తమ సాధారణ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా యువతి ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో వారు నిర్వహించిన కౌన్సెలింగ్ సెషన్‌లో ఆమెపై జరిగిన దారుణాల గురించి చెప్పింది. ఐదేళ్ల పాటు అనుభవించిన భయానక సంఘటనను వివరించడంతో ఆ స్వచ్ఛంద సంస్థ సభ్యులు జిల్లా వెల్ఫేర్ కమిటీకి నివేదిక సమర్పించారు.
ఘటనపై నివేదికను పరిశీలించిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బాధితురాలికి కౌన్సెలింగ్ ఇప్పించి కేసులో మరిన్ని విషయాలు రాబట్టింది.13 ఏళ్ల ప్రాయంలోనే తనపై అత్యాచారం జరిగిందని యువతి పేర్కొంది. క్రీడల్లో యాక్టివ్‌గా ఉండే ఆ బాలికపై ట్రెయినింగ్ సెషన్స్‌లో లైంగిక వేధింపులకు గురైన సందర్భాలను వెల్లడించింది. తన పొరుగింట్లో ఉన్న ఓ వ్యక్తి తనను కొండల ప్రాంతానికి తీసుకెళ్లి, ముగ్గురు స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది.తనపై అత్యాచారం చేసిన వీడియోలు ప్రచారంలోకి రావడంతో బహిరంగ ప్రదేశాల్లోనూ వేధింపులకు గురయినట్లు తెలిపింది.
కౌన్సెలింగ్ సెషన్‌లో ఆ యువతి తన బాధను వెల్లడించడంతో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఫిర్యాదు మేరకు పతనంతిట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు.యువతి స్టేట్‌మెంట్ ఆధారంగా పోలీసులు 62 మంది అనుమానితులను గుర్తించారు. ఈ కేసులో 10 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.ప్రస్తుతం ఆ యువతిని సంరక్షణ కేంద్రంలో ఉంచినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేసేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాట్లు చేసినట్లు పథనంథిట్ట ఎస్పీ పేర్కొన్నారు.