ఘోర ప్రమాదం.. ట్రాక్టర్‌ కిందపడి చిన్నారి దుర్మరణం

6 Month Old Baby Crushed To Death As Bike Tries To Overtake Speeding Tractor In Maharashtra. మహారాష్ట్రలోని పుణెలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. ఆరు నెలల చిన్నారి ట్రాక్టర్‌ టైర్ల కింద పడి

By అంజి  Published on  23 Sep 2022 10:45 AM GMT
ఘోర ప్రమాదం.. ట్రాక్టర్‌ కిందపడి చిన్నారి దుర్మరణం

మహారాష్ట్రలోని పుణెలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. ఆరు నెలల చిన్నారి ట్రాక్టర్‌ టైర్ల కింద పడి నలిగిపోయింది. పూణె-నాసిక్ హైవేపై రాజ్‌గురునగర్‌ వద్ద వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో ఆరు నెలల చిన్నారి మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. రాజ్‌గురునగర్‌ వద్ద ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను మహిళ, ఒక పాపతో వెళ్తున్న బైకర్‌.. ఓవర్‌ టేక్‌ చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే బైక్‌ అదుపు తప్పి కిందిపడిపోయింది. దీంతో బైక్‌ నడుపుతున్న వ్యక్తితో పాటు, మహిళ, ఆమె చేతిలో ఉన్న ఆరు నెలల చిన్నారి రోడ్డుపై పడ్డారు.

అయితే అదే సమయంలో వేగంగా వెళ్తున్న ట్రాక్టర్‌ ఆ చిన్నారి పైనుంచి వెళ్లిపోయింది. దీంతో ఆ పాప అక్కడికక్కడే మృతిచెందింది. అంతసేపు ఒడిలో ఉన్న పాప తన కళ్లముందే చనిపోవడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరయింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రద్దీగా ఉండే రోడ్డు కారణంగా బైక్ స్కిడ్ అయిందని ప్రమాదంపై ప్రాథమిక విచారణలో తేలింది. ప్రమాదం జరగడానికి ముందు చిన్నారి మహిళ ఒడిలో ఉన్నట్లు ఘటనాస్థలికి చెందిన ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.


Next Story
Share it